Telangana High Court : రాజు ఆత్మహత్యపై జ్యూడిషియల్ విచారణ-టీఎస్ హైకోర్టు ఆదేశం

సైదాబాద్ హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Telangana High Court : సైదాబాద్ హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రాజు ఆత్మహత్య పై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వరంగల్ 3వ మెట్రోపాలిటన్  మేజిస్ట్రేట్ కు విచారణ బాధ్యతలు అప్పగించి.. నాలుగు వారాల్లో సీల్డు కవర్ లో నివేదిక సమర్పించాలని తెలిపింది.

హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్యపై  పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ దాఖలు చేసిన  ప్రజాప్రయోజన వ్యాజ్యం‌పై  హై కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. రాజును పోలీసులు హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని లక్ష్మణ్ తన పిటీషన్ లో పేర్కోన్నారు. కాగా రాజు ఆత్మహత్య చేసుకున్నాడని అడ్వకేట్ జనరల్ న్యాయస్ధానానికి తెలిపారు.

Read Also : Extra Marital Affair : అక్రమ సంబంధం తెలిసి పోయిందని కొడుకు హత్య
ఏడుగురి సాక్ష్యాలు నమోదు వీడియో చిత్రీకరణ జరిగింది అని ఆయన తెలిపారు. ఆ వీడియోలను శనివారం రాత్రి 8 లోగా హైకోర్టుకు అప్పగించాలని ధర్మాసనం ఆదేశించింది. రాజు ఆత్మహత్యకు సంబంధించి సమాచారం ఉన్నవారెవరైనా వరంగల్ 3వ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరై సాక్ష్యం చెప్పాలని ఆదేశించింది.

విచారణను నాలుగు వారాల్లోగా పూర్తి చేసి నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టు రిజిష్ట్రారు కు అందించాలని హైకోర్టు తెలిపింది. కాగా…. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ సమీపంలోని నష్కల్ వద్ద రైలు పట్టాలపై   సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు మృతదేహాన్ని పోలీసులు గురువారం గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు