Two Chinese Shot in Karachi :పాకిస్తాన్‌లో ఇద్దరు చైనీయులపై కాల్పులు

పాకిస్తాన్‌లోని కరాచీలో ఇద్దరు చైనా జాతీయులపై ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. మోటారు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న చైనా జాతీయులపై గన్ తో కాల్చి పారిపోయారు.

Two Chinese Shot in Karachi : పాకిస్తాన్‌లోని కరాచీలో ఇద్దరు చైనా జాతీయులపై ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. మోటారు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న చైనా జాతీయులపై గన్ తో కాల్చి పారిపోయారు. కాల్పుల్లో గాయపడిన వారిని కరాచీలోని ఫ్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా తమ దేశీయులపై కాల్పుల ఘటనను ప్రత్యేకంగా చూడాల్సిన కేసు అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జావో లిజియన్ అన్నారు. పాకిస్తాన్ లో ఉన్న చైనా ప్రజల ఆస్తులు, ప్రాణాలకు ఆ దేశం రక్షణ కల్పిస్తుందని తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా ఈనెల14న ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని ఎగువ కోహిస్తాన్ లోని దాసు ఆనకట్ట వద్దకు చైనా ఇంజనీర్లుతో వెళుతున్న బస్సుపై ఐఈడీ దాడి జరిగింది. ఈదాడిలో తొమ్మిదిమంది చైనా పౌరులతో సహా 13 మంది మరణించారు. ఈఘటన జరిగిన రెండు వారాలకు కరాచీలో ఇద్దరు చైనా జాతీయులుపై  కాల్పులు జరపటం కలకలం రేపింది.

ఈ ఏడాది ఏప్రిల్ లో నైరుతి పాకిస్తాన్‌లోని క్వెట్టాలో చైనా రాయబారి బస చేసిన ఒక స్టార్ హోటల్ లో బాంబు పేలి నలుగురు మరణించారు.  2019 లో గాడ్వార్ లో సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు. కొందరు గాయపడ్డారు.

ఏది ఏమైనా పాకిస్తాన్ లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టి తన మిత్ర దేశంగా మార్చుకుంది. పాక్ ఆర్మీ లో ప్రతి 15,000 మంది సైనికులకు రెండు ప్రత్యేక సెక్యూరిటీ విభాగాలను ఏర్పాటు చేసి.. ఆ సైనికులకు శిక్షణ ఇవ్వడం, ఈ విభాగాలకు అవసరమైన నిధులు సమకూర్చటం వంటి ‘సహాయక’ చర్యలను చైనా చేపట్టింది.

ట్రెండింగ్ వార్తలు