Two Coaches Separate From Train : రైలు నుంచి విడిపోయిన రెండు బోగీలు

తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి రెండు బోగీలు విడిపోయాయి. అప్పటికే వేగంగా వెళ్తున్న రైలు ఆ రెండు బోగీలను వదిలి వెళ్లిపోయింది. అయితే డబ్బాలు విడివడటాన్ని గుర్తించిన లోకోపైలట్‌ రైలును తర్వాతి స్టేషన్‌లో ఆపాడు.

Two coaches separate from train

Two Coaches Separate From Train : తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి రెండు బోగీలు విడిపోయాయి. అప్పటికే వేగంగా వెళ్తున్న రైలు ఆ రెండు బోగీలను వదిలి వెళ్లిపోయింది. అయితే డబ్బాలు విడివడటాన్ని గుర్తించిన లోకోపైలట్‌ రైలును తర్వాతి స్టేషన్‌లో ఆపాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ బోగీలు పట్టాలపై నిలిచిపోయాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎక్స్‌ప్రెస్‌ రైలు చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తోంది. ఈనేపథ్యంలో తిరువళ్లూరు స్టేషన్‌ దాటుతుండగా ప్రయాణికులకు భారీ శబ్ధం వినిపించింది. బోగీల మధ్య అనుసంధానంగా ఉండే కప్లింగ్‌ పిన్‌ ఊడిపోయింది. దీంతో ఎస్‌7, ఎస్‌8 కోచ్‌లు రైలు నుంచి విడిపోయాయి.

Guwahati-Bikaner : బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 12 బోగీలు.. ముగ్గురు మృతి

కొద్దిదూరం వెళ్లిన తర్వాత గుర్తించిన లోకోపైలట్‌ రైలును ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మళ్లీ రెండు బోగీలను రైలుకు కలిపారు. కప్లింగ్‌ పిన్‌ ఊడిపోవడంతోనే రైలు నుంచి బోగీలు విడిపోయాయని అధికారులు పేర్కొన్నారు.