Real Estate Cheaters : రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు-ఇద్దరు నిందితులు అరెస్టు

రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసారు.

Real Estate Cheaters : రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసారు. నకిలీ అగ్రిమెంట్ పేపర్లతో నగరంలోని ముసాపేట్ లో 1500 గజాల విలువైన భూమిని అమ్మటానికి నిందితులు యత్నించారు. ఇందుకోసం బంజారా‌హిల్స్ లోని ఒక వ్యాపారవేత్తతో 11 కోట్ల 25 లక్షల  రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు.

అడ్వాన్స్‌గా 1 కోటి 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. అనంతరం వ్యాపారవేత్త అగ్రిమెంట్‌ను పరిశీలించగా అది ఫేక్ అని తేలింది. దీంతో బాధిత వ్యాపారవేత్త హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు.
Also Read : Yasangi Paddy Crop : యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి-నిరంజన్ రెడ్డి
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడైన పేదిరిపాటి శేఖర్ గౌడ్ అనే వ్యక్తిని గత నెల 10వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్‌కు  తరలించారు. మరో నిందితుడైన సయ్యద్ షాహిద్‌ను నిన్న అరెస్ట్ చేసారు.  రెండో నిందితుడైన షాహిద్ పై హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో పలు కేసులు ఉన్నాయని సీసీఎస్ పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు