Viral Video : తుపాకులు,కత్తులతో బెదిరించి పట్టపగలే దోపిడి

దేశరాజధాని ఢిల్లీలో ఇద్దరు దోపిడీ దొంగలు పట్టపగలే మారణాయుధాలతో బెదిరించి ఓ హార్డ్ వేర్ షాపులో దోపిడీ చేసిన ఘటన చోటు చేసుకుంది.

Delhi Robbery

Viral Video : మారణాయుధాలు చూపించి పట్టపగలే దోపిడీ చేయటం దొంగలకు సులువుగా మారిపోయింది. ఈ క్రమంలో దుండగులు తమకు అడ్డువచ్చిన వారిని గాయపరచటానికి, అవసరం అయితే చంపటానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో ఇద్దరు దోపిడీ దొంగలు పట్టపగలే మారణాయుధాలతో బెదిరించి ఓ హార్డ్ వేర్ షాపులో దోపిడీ చేసిన ఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీలోని ఖేరా ఖుర్ద్ ఏరియాలోగ‌ల ఓ హార్డ్‌వేర్ షాపులో శ‌నివారం మ‌ధ్యాహ్నం  ఇద్దరు దొంగ‌లు హెల్మెట్ , ముసుగులు ధరించి తుపాకుల‌తో చొర‌బ‌డ్డారు. క్యాష్ కౌంట‌ర్‌లో ఉన్న వ్య‌క్తితో స‌హా దుకాణంలో ఉన్న‌ అందరికీ తుపాకులు చూపించి, కొట్టి  ఒక‌వైపుకు పంపించారు.

Read Also : Family Murder : ప్రియుడి కోసం స్త్రీ గా మారుతానన్నయువకుడు…ఒప్పుకోకపోవటంతో కుటుంబం హత్య

అనంత‌రం ఒక దుండగుకు క్యాష్ కౌంటర్ వద్ద న‌గ‌దు కోసం గాలించగా క‌నిపించ‌లేదు. దాంతో క్యాష్ కౌంట‌ర్‌లో ఉన్న వ్య‌క్తిని పిలిచి న‌గ‌దు తీసి ఇవ్వాల‌ని బెదిరించాడు. దాంతో చేసేదేమీ లేక అతడు టేబుల్ సొరుగులో దాచి ఉంచిన న‌గ‌దు తీసిచ్చాడు. అది తీసుకుని దొంగ‌లు అక్క‌డి నుంచి పారిపోయారు.

కాగా  షాపు యజమాని దోపిడీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  దుండగులు దోపిడీ చేస్తున్నప్పుడు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దోపిడీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి.