ఆరోగ్య సర్వే పేరుతో బాలుడ్ని కిడ్నాప్ చేసిన మహిళలు-కిడ్నాప్ సూత్రధారి మేనత్త

Two women abducted ten-year-old child on the pretext of conducting a survey : ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ఆరోగ్య సర్వే కోసం కాలనీకి వచ్చిన ఇద్దరు మహిళలు 10 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేశారు. అలర్టైన పోలీసులు 10 గంటల్లో బాలుడ్ని తల్లితండ్రులకు క్షేమంగా అప్పగించారు. మీరట్ లోని ట్రాన్స్పోర్ట్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దేవ లోక్ కాలనీలో నివసించే రిక్షా పుల్లర్ కు నలుగురు సంతానం వారిలో 10 ఏళ్ల ప్రిన్స్ కూడా ఉన్నాడు.

క్షయవ్యాధి గ్రస్తులను గుర్తించటాని కోసం ఆరోగ్య కార్యకర్తలుగా పరిచయం చేసుకుంటూ ఇద్దరు మహిళలు ఇటీవల కాలనీకి వచ్చారు. అందులో భాగంగా రిక్షా పుల్లర్ ఇంటివద్దకు వచ్చిన వారు ఇంటి ముందు ఆడుకుంటున్న అతని పిల్లల వివరాలు తీసుకున్నారు.

అనంతరం పిల్లలను తమతో రమ్మని కోరారు. అందుకు వారు అంగీకరించలేదు. తన తోబుట్టువులతో ఆడుకుంటున్న బాలుడు ప్రిన్స్ ను అడగ్గా అందుకు ఒప్పుకుని వారి వెంట వెళ్లాడు. అలా వెళ్లిన బాలుడు ఇంటికి తిరిగి రాలేదు. కొంతసేపటికి ఇది గ్రహించిన బాలుడి తండ్రి కాలనీలో చుట్టుపక్కల ప్రాంతాల్లో బాలుడి కోసం వెతికాడు. కనపడకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నపోలీసులు కాలనీకివచ్చి విచారణ చేపట్టారు.

బాలుడు ఆరోగ్య కార్యకర్తల వెంట వెళ్ళటం కొంతమంది చూశారు. ఆవిషయాన్ని వారు పోలీసులకు చెప్పారు. పోలీసులు సమీపంలోని సీసీటీవీ పుటేజి గమనించారు. బాలుడ్ని తీసుకు వెళుతున్న ఆరోగ్య కార్యకర్తలను గుర్తించారు. వారు బాలుడ్ని ఢిల్లీ రోడ్డు లోని మెవ్లా ఫ్లై ఓవర్ వరకు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి వచ్చి బాలుడ్ని బైక్ పై తీసుకువెళ్లటం గుర్తించారు.

బాలుడ్ని తీసుకువెళ్లిన మహిళలను గుర్తించన తండ్ర్రి తన సోదరి పై అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు వెంటనే బాలుడ్ని శాస్త్రి నగర్ లోని అతని అత్త ఇంటి నుంచి రక్షించారు. బాలుడి మేనత్తకు వివాహం అయ్యిందని, ఆమెకు పిల్లలు లేరని, భర్తను వదిలేసి వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న మేనత్త బాలుడ్ని ఇంటిలో వదిలేసి పరారయ్యింది. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.