Krishna District Murders
Krishna District : కృష్ణాజిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్ధలం సరిహద్దు వివాదంలో ప్రత్యర్ధులు తల్లీ, కూతుళ్లను దారుణంగా హత్య చేశారు. పెడన నియోజకవర్గం గూడురు మండలం పోసినవారిపాలెంలో ఆస్తి తగాదాల నేపధ్యంలో శాంతమ్మ(76) కుటుంబ సభ్యులపై ప్రత్యర్ధులు ఈరోజు ఉదయం దాడి చేశారు. ఈ దాడిలో శాంతమ్మ, ఆమె కుమార్తె రూప(40) అక్కిడి కక్కడే మరణించగా తీవ్రంగా గాయపడిన మరోక వ్యక్తిని బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆస్తి తగాదాల కారణంగానే హత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాయాదుల ఆస్తుల గొడవల్లో పోసిన శాంతమ్మ కుటుంబ సభ్యులు కోర్టులో దావా వేశారు. కోర్టు కేసును వాపసు తీసుకోమని ప్రత్యర్ధులైన పోసిన మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు కోరారు. అందుకు శాంతమ్మ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో ఈరోజు ఉదయం చింతల కొండయ్య, పోసిన మల్లేశ్వరరావు, పోసిన సాంబశివరావు, పోసిన సహదేవుడులు మరికొంతమందితో వచ్చి శాంతమ్మ కుటుంబ సభ్యులపై కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది.
Also Read : Ganja Batch : గంజాయి బ్యాచ్ వీరంగం-మత్తులో పోలీసు వాహనం ఎక్కి ధ్వంసం