యూబర్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలి ఎదుటే అసభ్యకరంగా ప్రవర్తించి అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన గుర్‌గావ్‌లో బుధవారం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన యువతి గుర్‌గావ్‌లో మెట్రోస్టేషన్‌కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది.
‘కారు ఎక్కిన కాసేపటికే డ్రైవర్.. మాస్టర్‌బాటింగ్ మొదలుపెట్టాడు’ అని గుర్‌గావ్ పోలీస్ అధికారి సుభాశ్ బొకాన్ తెలిపారు. ఆ మహిళ మెట్రో స్టేషన్ దగ్గర దిగి ఆటోలో ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. జరిగినదంతా ఆమె తండ్రికి వివరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘కేసు నమోదు చేసిన తర్వాత నిందితుడి ఫోన్ నెంబర్‌ను ట్రాకింగ్‌లో ఉంచాం. దాని ద్వారా అతణ్ని అరెస్ట్ చేయగలిగాం’ అని పోలీసులు తెలిపారు.
Read More>> భార్య కళ్లెదుటే లారీ డ్రైవర్ దారుణ హత్య