Udaipur Murder : ఉదయ్ పూర్ నిందితులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధతో లింకులు

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో   నిన్న జరిగిన టైలర్ కన్హయ్య హత్య కేసులో అరెస్టైన నిందితుడు రియాజ్ అఖ్తరీకి అనుమానిత ఉగ్రవాద సంస్ధలతో సంబంధాలున్నట్లు  ఎన్ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. 

Udaipur Murder : రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో   నిన్న జరిగిన టైలర్ కన్హయ్య హత్య కేసులో అరెస్టైన నిందితుడు రియాజ్ అఖ్తరీకి అనుమానిత ఉగ్రవాద సంస్ధలతో సంబంధాలున్నట్లు  ఎన్ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.  నిన్నటి ఉదయ్ పూర్ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ NIA బృందం విచారణ జరుపుతోంది.

ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఢిల్లీ కేంద్ర కార్యాలయం నుంచి ఎన్‌ఐఎ బృందం ఉదయ్‌పూర్‌కు చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.  నిందితుడు రియాజ్ అక్తర్‌కు పాకిస్తాన్ సంస్థ   ‘దావత్-ఎ-ఇస్లామీ’తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోందని దర్యాప్తు అధికారులు తెలిపారు.  ఈ  ఉగ్రవాద సంస్థ దేశంలో అనేక  ప్రాంతాలలో కూడా శాఖలను కలిగి ఉన్నట్లు ఎన్‌ఐఎ అధికారులు వివరించారు.

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్   సల్మాన్ తసీర్ హత్యతో సహా అనేక ఇతర ఉగ్రవాద సంఘటనలకు ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన కొంతమంది సభ్యులే కారణంగా గుర్తించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.  కన్హయ్య హత్య అనంతరం ఉదయ్ పూర్ లో నెల రోజులపాటు 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో 24 గంటలు పాటు రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ  ఘటన దేశంలో ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరుగుతుంది అనడానికి ఒక ఉదాహరణగా నిలిచింది. కాగా, హత్యకు గురైన కన్హయ్యకు సంబంధించిన అటాప్సీ ప్రాథమిక నివేదిక వెల్లడైంది.   కన్హయ్య ఒంటిపై 26 కత్తి పోట్లు ఉన్నాయని, అధిక రక్తస్రావం కావడం వల్లే మరణించాడని ఈ నివేదిక చెబుతోంది. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకున్న వీడియోను స్థానిక కాంగ్రెస్ నేత సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది.

Also Read : Udaipur killing: కన్హయ్య హత్య నిందితులకు పాక్‌తో సంబంధాలు.. కేసు ఎన్ఐఏకు అప్పగింత

ట్రెండింగ్ వార్తలు