పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది.
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన నీరవ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మోడీకి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. శుక్రవారం (ఏప్రిల్ 26, 2019) వాండ్స్ వర్త్ జైలు నుంచే వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా లండన్ కోర్టుకు నీరవ్ హాజరయ్యారు.
నీరవ్ బెయిల్ పిటిషన్ పై విచారించిన కోర్టు.. ఆయన పిటిషన్ ను తోసిపుచ్చింది. నీరవ్ పోలీసు కస్టడీని మే 24వరకు పొడిగించింది. మార్చి19న లండన్ లో అరెస్ట్ అయిన 48ఏళ్ల నీరవ్ మోడీని వాండ్స్ వర్త్ జైలుకు తరలించారు. జైలు నుంచే వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా హాజరైన నీరవ్ ను కోర్టు విచారించింది. తదుపరి విచారణను మే 24న మేజిస్ట్రేట్ కోర్టు మరోసారి విచారించనుంది.