Illlicit Affair
Illicit Affair : ఉపాధికోసం గల్ఫ్‌లో కొడుకు ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే స్ధానికంగా ఉంటున్న కోడలు అడ్డదారులు తొక్కుతోంది. కోడలు ప్రవర్తన చూసి తట్టుకోలేని మామ కోడల్ని పొడిచి చంపాడు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలెనికి చెందిన చొప్పల సత్యనారాయణకు ప్రియమణి స్వయాన సోదరి కూతురు.
సోదరి కుటుంబం అండమాన్‌లో నివాసం ఉంటున్నారు. సత్యానారాయణ కుమారుడు కుడా ఉపాధి కోసం అండమాన్ వెళ్ళాడు. అక్కడే ఏడేళ్ల క్రితం మేనత్త కూతురు ప్రియమణిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక బాబు పుట్టాడు. కొన్నాళ్ల క్రితం అండమాన్ నుంచి మేడిచెర్ల గ్రామానికి తిరిగి వచ్చాడు.
ఈసారి ఉద్యోగ రీత్యా గల్ఫ్ వెళ్లాడు. భర్త గల్ఫ్ వెళ్లినప్పటి నుంచి ప్రియమణి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె అడ్డదారులు తొక్కుతోందని తెలుసు కున్నాడు మామ సత్యనారాయణ. కోడలిపై ఆగ్రహంతో ఉన్న సత్యనారాయణ శుక్రవారం కోడలు ప్రియమణిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కోడల్ని తానే హత్యచేశానని పోలీసులకు చెప్పాడు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.