ఇప్పుడే వస్తానన్న కొడుకు ఇంకా రాలేదు. సాయంత్రం అవుతోంది. తల్లిదండ్రుల్లో కంగారు. ఒక్కటే టెన్షన్. ఎక్కడ పోయాడో ? ఏమైందోనని. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్. తమ కొడుకు కనబడడం లేదని. పోలీసులు గాలిస్తున్నారు. అంతలోనే షాక్. ఓ వీడియో వారందరినీ భయకంపితులను చేసింది. యువకుడు ఒంటిపై గాయాలతో నగ్నంగా పడి ఉండడం..అక్కడున్న ఓ గుంపు..అతడిపై యూరిన్ పోస్తూ..పైశాచిక ఆనందం పొందుతున్నారు.
నగ్నంగా ఉన్నది తమ కొడుకేనని ఆ తల్లిదండ్రులు గుర్తించారు. సృహ లేకుండా పడి ఉన్న కుమారుడి పరిస్థితి చూసి ఆ పేరెంట్స్ గుండె తరుక్కపోయింది. ప్రస్తుతం అతను ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సభ్య సమాజం తలదించుకొనే ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
చంద్రపూర్ జిల్లాలోని గోపాల్ పట్టి ప్రాంతంలో వరద్ వినాయక్ సొసైటీలో భారతి గౌతమ్ అవచ్చారే కుటుంబం నివాసం ఉంటోంది. శ్రేయాస్ గౌతమ్ అవచ్చారే (15) కొడుకు ఉన్నాడు. కాలనీలో శివ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అక్కడకు వెళుతున్నట్లు తనతో చెప్పాడని తల్లి భారతి వెల్లడించింది. అయితే. కానీ తిరిగి ఇంటికి చే రుకోలేదు. హదాస్ పూర్ పీఎస్‌లో మార్చి 19వ తేదీ గురువారం ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి గాలింపులు చేపట్టారు.
See Also | ఏం కర్మరా బాబూ, పోసుకుందామని BMW ఆపాడు, కట్ చేస్తే కారు లేదు..
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో యువకుడు బట్టలు లేకుండా..కాళ్లు కట్టేసి ఉండడం కనిపించాయి. దారుణంగా కొట్టినట్లుగా ఉంది. ఎదురుగా ఆరుగురు కత్తులు పట్టుకుని..యువకుడిపై యూరిన్ పోస్తూ పైశాచిక ఆనందం పొందారు. వీడియో చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంజ్రీ రైల్వే స్టేషన్ వద్ద ఓ యువకుడు సృహ లేకుండా పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. తమ కుమారుడేనని తల్లిదండ్రులు గుర్తించారు. ఇతడిని సాసున్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఘటనలో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. వినీత్ సూర్యాకాంత్, శుభం రాజభవు, దేవిదాస్ ఘన్ శ్యామ్, భారత్ విశాల్ రాథోడ్ నలుగురిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టయిన వారికి మార్చి 19 వరకు పోలీసు కస్టడీ విధించారు.
Read More : ఇరాన్ టు భారత్ : రాజస్థాన్‌కు 53 మంది భారతీయులు