తన కూతురికి సత్వర న్యాయం జరగాలంటే నిందితులను హైదరాబాద్ దిశ ఘటనలో పోలీసులు ఎలా అయితే ఎన్‌కౌంటర్ చేశారో అలానే ఎన్‌కౌంటర్ చేయాలని కన్నుమూసిన ఉన్నావ్ బాధితురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఉన్నావ్ బాధితురాలు 90శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
దీనిపై రాజకీయ దుమారం రేగింది. బాధితురాలికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఉన్నావ్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఉన్నావ్‌లో అంతకు ముందు ఒక ఘటన జరిగిన తర్వాత కూడా బాధితురాలికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉన్నావ్ అత్యాచార ఘటనకు నిరసనగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఎదుట ధర్నా చేశారు. అత్యాచార నిందితులకు బీజేపీతో సంబంధాలున్నాయని అఖిలేష్ ఆరోపించారు. ముఖ్యమంత్రి గద్దె దిగేవరకు యూపీ శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడదన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు మాయావతి.
ఉన్నావ్ ఘటనలో దోషులెవరూ తప్పించుకోలేరని యోగి సర్కార్ స్పష్టం చేసింది.
* ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
* ఈ కేసు దర్యాప్తునకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
* బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందు ఇద్దరు మంత్రులను ఉన్నావ్‌కు ప్రభుత్వం పంపింది. అయితే బీజేపీ నేతల పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
* బీజేపీ నేతలను ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఉన్నావ్ బాధితురాలు 90శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు తుదిశ్వాస విడిచింది. ఉన్నావ్ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తునకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
Read More : న్యాయ ప్రక్రియ సామాన్యులకు అందుబాటులో లేదన్న రాష్ట్రపతి