Farmer Suicide : అప్పు విషయమై బ్యాంకు నుంచి నోటీసు… ఆత్మహత్య చేసుకున్న రైతు

బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 50 వేల రుణం చెల్లించటంలో విఫలమయ్యారని బ్యాంకు అధికారులు పంపించిన నోటీసు చూసి మనస్తాపానికి గురైన ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నఘటన ఉత్తర ప్రదేశ్ లోని అరుయా జిల్లాలో చోటు చేసుకుంది.

Up Farmer Ends Life

Farmer Suicide : బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 50 వేల రుణం చెల్లించటంలో విఫలమయ్యారని బ్యాంకు అధికారులు పంపించిన నోటీసు చూసి మనస్తాపానికి గురైన ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నఘటన ఉత్తర ప్రదేశ్ లోని అరుయా జిల్లాలో చోటు చేసుకుంది.

అరుయ జిల్లాకు చెందిన రైతు సుఖ్‌రాం భదౌరియా వ్యవసాయం నిమిత్తం బ్యాంకు నుంచి రూ. 50 వేలు రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించటంలో విఫలమైనందుకు..రుణం  తిరిగి రాబట్టుకునేందుకు  బ్యాంకు వారు సోమవారం ….సెప్టెంబర్6వ తేదీన ….   రైతుకు నోటీసులు పంపారు. బ్యాంకు అధికారులు నోటీసులు పంపటం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన రైతు సుఖ్‌రాం నోటీసు వచ్చిన రెండు రోజులకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం ఇంటినుంచి పొలానికి వెళ్లిన సుఖ్‌రాం రెండు గంటల తర్వాత ఊరి చివరి వేప చెట్టుకు ఉరివేసుకుని  విగత జీవిగా మారాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం  నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సుఖ్‌రాం కరోనా  ఫస్ట్ వేవ్ వచ్చిన సమయంలో  గతేడాది  తన కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగించి  బ్యాంకునుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నాడు.  ఈ మొత్తాన్ని సకాలంలో చెల్లించటంలో విఫలం అవటంతో బ్యాంకు అతనికి నోటీసులు పంపించింది.  రికవరీ కోసం బ్యాంకు నోటీసులు పంపటం…  అప్పు చెల్లించాలని ఒత్తిడి పెరగటంతో  రైతు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.