UP police attacked women
UP police attacked women : ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలు, పైపులు, కట్టెలతో దాడి చేశారు. అంబేద్కర్‌నగర్ జిల్లా జలాల్‌పూర్‌లోని ఓ ప్రాంతంలో ఇటీవలే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అయితే ఆ ప్రాంతం తమదంటూ అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. దీంతో ప్రాంతంపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా వివాదాస్పద ప్రాంతంలో నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులపై లాఠీలు, పైపులు, కట్టెలతో విచక్షణా రహితంగా దాడి చేశారు.
Delhi shocker : దేశ రాజధానిలో షాకింగ్ ఘటన.. మహిళలపై విచక్షణారహితంగా దాడి.. వీడియో
పోలీసులు ఓ మహిళ తలపై కొట్టడంతో ఆమె అక్కడే పడిపోయింది. అయితే మహిళలు తమపై ఇటుకలతో దాడి చేశారని, మహిళా అధికారిని జుట్టు పట్టుకుని కొట్టారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము లాఠీలకు పని చెప్పామని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.