Scammers వాడే ట్రిక్ ఇదే : UPI పేమెంట్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

  • Publish Date - January 14, 2020 / 11:12 AM IST

అంతా డిజిటల్ మయం.. ప్రతిఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ చేస్తుండటంతో ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండేది.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే చేతులో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఈజీగా నగదు లావాదేవీలు జరిగిపోతున్నాయి. అన్నీ అన్ లైన్‌లోనే.. ఇంతవరకు బాగానే ఉంది. మరోవైపు సైబర్ మోసగాళ్లు కూడా ఇదే అదనుగా చేసుకుని రెచ్చిపోతున్నారు.

డిజిటల్ పేమెంట్స్ నిర్వహించే ఎన్నో వ్యాలెట్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో స్మార్ట్ మొబైల్లో వ్యాలెట్లు ఉంటున్నాయి. గూగుల్ పే, పేటీఎం, Phonepe సహా ఇలా ఎన్నో డిజిటల్ వ్యాలెట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకుల నుంచి నగదును వ్యాలెట్లలోకి.. వ్యాలెట్లలో నుంచి బ్యాంకుల్లోకి నగదు జమ చేయాలంటే తప్పనిసరిగా UPI యాక్సస్ ఉండాల్సిందే. అప్పుడే బ్యాంకు ట్రాన్సాక్షన్లు చేయడానికి వీలుంటుంది. యూపీఐ (UPI) అంటే.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ అని అంటారు. ఈ సర్వీసు ద్వారా ఎంత ఈజీగా డబ్బులు పంపుకోవచ్చో అంతే ఈజీగా సైబర్ మోసగాళ్ల చేతుల్లో కూడా పెట్టవచ్చు. మోసాలు జరగడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి.

మోసగాళ్ల వలలో పడొద్దు :
సైబర్ మోసగాళ్లు డిజిటల్ పేమెంట్లపై రకరకాల ట్రిక్స్ వాడుతున్నారు. మోసగాళ్ల యూపీఐ యూజర్లను ట్రాప్ చేసేందుకు ఎన్ని ఎత్తులైనా వేస్తుంటారు. ఫేక్ కాల్స్ చేస్తుంటారు. SMSలు పంపుతారు.. పేటీఎం కేవైసీ వంటి మీ వ్యక్తిగత వివరాలను కూడ అడుగుతారు. అది కూడా బ్యాంకు అధికారిగానో ఏదో ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం ఇస్తామనో లేదా ఏదో మీకు బంపర్ ఫ్రైజ్ వచ్చిందనో ఇలా ఏదో రకంగా యూపీఐ యూజర్లను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తుంటారు.

Fraud ఎలా జరుగుతుందంటే:
మీ UPI ID అడుగుతారు. అదిరిపడి ఇవ్వొద్దు. ఏదైనా ఆన్ లైన్ లో ఆర్డర్ చేశారా? అని అంటారు. మీకు లక్షల ప్రైజ్ మనీ గెల్చుకున్నారని చెబుతారు. మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ అడుగుతారు. లేదంటే డిజిటల్ వ్యాలెట్ ఐడీలు అడుగుతారు.. నమ్మి వారికిస్తే మోసపోతారు జాగ్రత్త అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. గూగుల్ పే లేదా ఫోన్ పే, పేటీఎం నుంచి Money Request పెడతారు. ఆ విషయం తెలియక మీరు Accept చేశారంటే మీ అకౌంట్లో డబ్బులు గోవిందా.. మీ ప్రమేయం లేకుండా ఏదైనా మనీ రిక్వెస్ట్ వస్తే స్పందించకండి.. Send money ఆప్షన్.. Request Money ఆప్షన్ తేడా తెలుసుకోండి. ఇక్కడే ఎక్కుమంది మోసపోయే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త..

ఎలా Safe అవ్వాలంటే :
UPI యాప్స్ నుంచి యూజర్లు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే కచ్చితంగా M-PIN ఎంటర్ చేయాల్సిందే. ఈ UPI అకౌంట్ ద్వారా ప్రతి బ్యాంకు అకౌంట్ ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. M-PIN అంటే ఇదో రకమైన ATM PIN లాంటిదే. దీనికి కూడా 4 నుంచి 6 డిజిట్ నెంబర్లు ఉంటాయి. మీ బ్యాంకు అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా లేదా మనీ ఎవరికైనా పంపాలన్నా ఈ యూపీఐ యాప్ ద్వారా చెకింగ్ చేసుకోవచ్చు. కానీ, ఈ UPI M-PIN ఎవరికి చెప్పకూడదు.. సోషల్ మీడియాలో షేర్ చేయరాదు. ఇదే M-PIN ద్వారనే యూపీఐ యాప్ లోకి లాగిన్ యాక్సస్ చేసుకోవచ్చు. దీన్నే pass code అని కూడా పిలుస్తారు. ఈ యాప్ సేఫ్ గా ఉంచుకోవాలంటే తప్పనిసరిగా ప్రతిఒక్కరూ UPI M-PIN lock సెట్ చేసుకోవాలి. అప్పుడే ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేయకుండా నియంత్రించవచ్చు.

యూపీఐ రిక్వెస్ట్ వద్దు.. UPI ID అడగండి :
ప్రతి ట్రాన్సాక్షన్ చేయడానికి యూపీఐ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త వారితో యూపీఐ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారి నుంచి యూపీ రిక్వెస్ట్ అడగానికి బదులుగా UPI ID అడిగి తీసుకోండి అదే.. ఉత్తమం.. ఇలాంటి రిక్వెస్ట్ లతో మోసాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. యూపీఐ ఐడీ ఆధారంగా ఆ అకౌంట్ ఎవరిది అనేది గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైనా మీకు మనీ రిక్వెస్ట్ UPI నుంచి చేస్తే.. కంగారు పడకండి.. దాన్ని సింపుల్ గా Decline చేయండి.. అప్పుడు మీ అకౌంట్ నుంచి నగదు కట్ కాదు. M-PIN ద్వారా రిక్వెస్ట్ Accept చేస్తేనే ఇతరులకు మీ నుంచి నగదు బదిలీ అవుతుంది. కాబట్టి టెన్షన్ పడక్కర్లేదు..

UPIలో మెసేజ్ జాగ్రత్తగా చదవండి :
యూపీఐ యాప్స్ వాడే యూజర్లంతా ముందుగా గుర్తించుకోవాల్సిన విషయం ఒకటి.. మీ UPIకి నోటిఫికేషన్ రూపంలో ఏదైనా మెసేజ్ వస్తే అలర్ట్ అవ్వండి.. అది ఏం మెసేజ్ అనేది నిశితంగా పరిశీలించండి. మీ ప్రమేయం లేకుండానే ఇతరులు ఎవరైనా పంపారో లేదో చెక్ చేసుకోండి.. ఒకవేళ యూపీఐకి పంపిన మెసేజ్ మీకు అర్థం కాకపోతే వదిలేయండి.. భాష పరంగా ఇబ్బంది లేకుండా మీకు అర్థమయ్యే భాషలోనే సెట్ చేసుకోండి.. యూపీఐలో నచ్చిన భాషను ఎంచుకోనే ఆప్షన్లు ఉన్నాయి.