Couple Consumes Poison: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. పది రోజులకే ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లై పది రోజులే అవుతోంది. కానీ, ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారు. ఇద్దరిలో భార్య మరణించింది. భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.
- Narender Thiru
- Published On : September 21, 2022 / 08:07 AM IST
Couple Consumes Poison: ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్ జిల్లా, బదాపూర్ ప్రాంతంలో దారుణం జరిగింది. పెళ్లైన పది రోజులకే నవ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో భార్య మరణించింది. భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
BiggBoss 6 Day 16 : “దొంగ-పోలీస్” వేట.. హీటెక్కిన బిగ్‌బాస్ ఆట!
బదాపూర్ ప్రాంతంలోని భోగ్‌పూర్ గ్రామానికి చెందిన బిందర్ సింగ్ (22)కు, నీలమ్ కౌర్ (19) అనే యువతికి పది రోజుల క్రితం పెళ్లి జరిగింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరిదీ ప్రేమ వివాహం. అయితే, ఇద్దరూ రెండు రోజుల క్రితం విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో నీలమ్ కౌర్ మరణించింది. ఆమె భర్త బిందర్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నీలమ్ కౌర్ విషం తాగినట్లు ఆమె కుటుంబ సభ్యులకు, బంధువులు సమాచారం అందించారు. ఆమె తండ్రి ఇంటికి చేరుకుని చూసేటప్పటికే నీలమ్ కౌర్ మరణించింది. అనంతరం బిందర్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది.
తమ కూతురును వరకట్నం కోసం వేధించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని నీలమ్ కౌర్ తండ్రి ఆరోపించారు. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని, అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు ముందుగా నీలమ్ కౌర్ విషం తాగి మరణించిందని, ఆ తర్వాత ఆమె భర్త విషం తాగాడని స్థానికులు అంటున్నారు. ఇద్దరి మధ్యా తలెత్తిన వివాదమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.
