Khammam Injection Murder Case : బైక్ లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్‌తో హత్య కేసు.. పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్?

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా వల్లభి మర్డర్ మిస్టరీ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. బైక్ లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్ ఇచ్చి షేక్ జమాల్ సాహెబ్ ను(52) హత్య చేసిన కేసులో పోలీసులు వేగంగా దర్యాఫ్తు జరుపుతున్నారు.

Khammam Injection Murder Case : బైక్ లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్‌తో హత్య కేసు.. పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్?

Khammam Injection Murder Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా వల్లభి మర్డర్ మిస్టరీ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. బైక్ లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్ ఇచ్చి షేక్ జమాల్ సాహెబ్ ను(52) హత్య చేసిన కేసులో పోలీసులు వేగంగా దర్యాఫ్తు జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటోడ్రైవర్ మోహన్ రావును నామారం ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

ఇంతకీ ఆ సూదిగాడు ఎవరు? ఇంజెక్షన్ ఇచ్చి ఎందుకు చంపేశారు? జమాల్ సాహెబ్ ను మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు.

బైక్ లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్‌తో వ్యక్తిని చంపిన కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభిలో సోమవారం జరిగిన ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. జమాల్‌ సాహెబ్‌ హత్యలో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నిందితుల కోసం ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపడంతో ప్రత్యేక దృష్టి సారించిన ఖమ్మం నగర పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌.. ఈ హత్య కేసులో మిస్టరీని ఛేదించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

చింతకాని మండలం మున్నేటికి చెందిన వారు ఈ హత్యకు కుట్ర పన్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. జమాల్‌ సాహెబ్‌ను చంపేందుకు నిందితులు పక్కా ప్రణాళిక రచించినట్టు గుర్తించారు. ఈ హత్యలో ఇద్దరు డ్రైవర్లు, ఒక ఆర్‌ఎంపీ డాక్టర్ ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. జమాల్‌ భార్య ఫోన్‌ కాల్‌ లిస్ట్ లో నిందితుల ఫోన్‌ నంబర్లు ఉన్నాయని.. వారితోనే ఆమె ఎక్కువసార్లు మాట్లాడినట్టు పోలీసులకు ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.

ఎన్నడూలేని విధంగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్‌ అడిగి మరీ వెనుక నుంచి ఇంజెక్షన్‌ ఇచ్చి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ హత్యకు దారితీసిన కారణాలేంటి? ఇదే మార్గాన్ని నిందితులు ఎందుకు ఎంచుకున్నారనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు.

జమాల్‌ సాహెబ్‌ కుటుంబ సభ్యులకు ఈ హత్యలో ఏమైనా ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ పోలీసుల విచారణ జరుగుతోంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫోన్‌కాల్‌ డేటాను పోలీసులు సేకరించారు. అందులో కొందరు వ్యక్తులతో ఆయన భార్య సంభాషించినట్టు పక్కా వివరాలు సేకరించి ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నించారు. హత్యకు కుట్ర పన్నిన ముగ్గురు వ్యక్తులు.. జమాల్‌ సాహెబ్‌ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని లిఫ్ట్‌ అడిగి చంపినట్టు సమాచారం.

ఈ హత్యకు ప్రధానంగా వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు.