Uttar Pradesh : woman stabbed to death for spurning advances by nephew : ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో దారుణం జరిగింది. వావివరుసలు మరిచి కామంతో కళ్లు మూసుకుపోయిన విద్యార్ధి తన మేనత్తపై కన్నేశాడు. తన కోర్కెలు తీర్చలేదని ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
మీరట్ కు చెందిన యువకుడు(22) బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతని ఇంటికి సమీపంలోనే మేనత్త ఒంటరిగా జీవిస్తోంది. ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన యువకుడు గత బుధవారం మేనత్త ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఇంటికి వెళ్లి తన శారీరక కోర్కెలు తీర్చాలని కోరాడు. ఆమె కోపంతో అతడి చెంప చెళ్లుమనిపించింది. ఈవిషయం ఇంట్లో వారికి చెబుతానని హెచ్చరించింది.
దీంతో ఆగ్రహించిన యువకుడు వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి ఆమె గొంతు కోసి చంపాడు. అనంతరం ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయాడు. మర్నాడు ఇంట్లో శవాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్దలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఆమె కుటుంబీకులను విచారిస్తున్న సమయంలో బీకామ్ చదువుతున్న యువకుడిని కూడా విచారించారు. మేనత్తను చంపే క్రమంలో జరిగిన పెనుగులాటలో యువకుడి చేతిపైనా. ఛాతిపైనా గాయాలయ్యాయి. వాటి గురించి పోలీసులు అడిగినప్పడు సరైన సమాధానం ఇవ్వలేక పోయాడు.
అతడ్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో పోలీసులు విచారించారు. నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. అతడి ఇంటిలో హత్యకు ఉపయోగించిన కత్తిని, రక్తంతో తడిసిన బట్టలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.