Hiroshi Suzuki
Hiroshi Suzuki : ప్రస్తుతం ‘జైలర్’ ఫీవర్ నడుస్తోంది. జపాన్ నుంచి రీసెంట్‌గా ఓ జంట చెన్నై వచ్చి మరీ జైలర్ సినిమా చూసారు. ఇప్పుడు భారత్ లోని జపాన్ రాయబారి హిరోషీ సుజుకి రజనీపై ప్రశంసలు కురిపించారు. అంతేనా రజనీ స్టైల్లో కళ్లద్దాలు తిప్పడానికి ట్రై చేశారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. జైలర్ రిలీజ్ తరువాత వారంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తన ట్విట్టర్ ఖాతాలో (@HiroSuzukiAmbJP) చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తలైవర్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నట్లు వీడియో ఓపెన్ అవుతుంది. రజనీకాంత్ కళ్లద్దాలు తిప్పే స్టైల్లో తాను కూడా తిప్పడానికి సుజుకి ప్రయత్నించారు. అందుకు ఓ వ్యక్తి సాయం తీసుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఛాలెంజ్ ని ప్రయత్నించిన సుజుకి ‘రజనీకాంత్ మీరు అద్భుతంగా ఉన్నారు. జైలర్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని విష్ చేసారు.
NTR : RRRలో నాకు నచ్చిన యాక్టర్ ఎన్టీఆర్.. జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి..!
సుజుకి తన పోస్టులో ‘నమస్కారం .. జపాన్ కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది’ అనే శీర్షికతో రజనీకాంత్‌కు ట్యాగ్ చేస్తూ వీడియోను పోస్టు చేశారు. సుజుకి పోస్ట్‌పై నెటిజన్లు స్పందించారు. ‘రజనీకాంత్ లాగ కళ్లద్దాలు తిప్పడానికి చేసిన ప్రయత్నానికి అభినందనలు అని’.. ‘జపనీస్ అంబాసిడర్ మీరు చాలా కూల్‌గా ఉన్నారు’ అంటూ కామెంట్లు చేశారు.
Vannakkam!@Rajinikanth, #Japan also loves you a lot!?#Jailer #rajinifans pic.twitter.com/ced3GUiHi7
— Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) August 11, 2023