Drugs Seized : విశాఖలో మాదక ద్రవ్యాలు స్వాధీనం-ఒకరి అరెస్ట్

విశాఖపట్నం గాజువాక లో ఒకయువకుడి నుంచి పోలీసులు   నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గిరీష్ తేజ నాయుడు(25) అనే యువకుడు ఇన్‌స్టాగ్రాం  ద్వారా డ్రగ్స్  తెప్పిస్తున్నట్లు గుర్తించామని నగర పోలీసు కమీషనర్ శ్రీకాంత్ చెప్పారు.

Drugs Seized :  విశాఖపట్నం గాజువాక లో ఒకయువకుడి నుంచి పోలీసులు   నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గిరీష్ తేజ నాయుడు(25) అనే యువకుడు ఇన్‌స్టాగ్రాం  ద్వారా డ్రగ్స్  తెప్పిస్తున్నట్లు గుర్తించామని నగర పోలీసు కమీషనర్ శ్రీకాంత్ చెప్పారు.

గిరీష్ వద్ద  నుంచి 63 ఎల్.ఎస్.డి డ్రగ్స్ పాకెట్లు స్వాధీనం చేసుకున్నామని… ఒక్కో పాకెట్ వెయ్యిరూపాయలకు కొనుగోలు చేసి  విశాఖలో రెండు వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.  మొత్తం 80 డ్రగ్స్ ప్యాకెట్లు తెప్పించాడని ఇప్పటికే 17 ప్యాకెట్లు అమ్మాడని పోలీసులు  తెలిపారు.

అతని సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని మాదక ద్రవ్యాలను ఎవరెవరికి అమ్మాడో పోలీసులు గుర్తిస్తున్నారు. ఇక్కడి గంజాయిని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేసి అక్కడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకు  వస్తున్నాడని పోలీసులు  వివరించారు. విశాఖలో యాంటి నార్కోటిక్ డ్రగ్ సెల్ ఏర్పాటు చేసిన తర్వాత డ్రగ్స్, గాంజా, మత్తు ఇంజెక్షన్లు కు సంబందించి 94 కేసులు నమోదు చేశామని పోలీసు కమీషనర్ తెలిపారు.

డ్రగ్ పెడ్లర్స్ హైదరాబాద్, ఒరిస్సా, బెంగళూర్, గోవాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. తల్లితండ్రులు కూడా పిల్లల్లో ఉన్న మార్పులు గుర్తించాలి. ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయడం, ఊరికే కోపం రావడం, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు ఉన్న పిల్లలను గుర్తించాలి. సింగిల్ పేరెంట్ చైల్డ్, మితిమీరిన క్రమశిక్షణ మధ్య పెరిగిన పిల్లలు ఎక్కువగా డ్రగ్‌కు అలవాటు పడడం, తర్వాత పెడ్లర్స్ గా మారడం జరుగుతోందని పోలీసు కమీషనర్ తెలిపారు.
Also Read : Pratysha Garimella : తన మరణం నన్ను బాధిస్తుంది.. ప్రత్యూష ఆత్మహత్యపై ఉపాసన ఎమోషనల్ పోస్ట్..

ట్రెండింగ్ వార్తలు