Viveka Murder Case : వైఎస్ వివేకా హత్యకేసు విచారణకు హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 90 వ రోజు విచారణ ఈరోజు కూడా కొనసాగింది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఈరోజు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు.

Viveka Murder Case

Viveka Murder Case :  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 90 వ రోజు విచారణ ఈరోజు కూడా కొనసాగింది.  ఏపీ సీఎం మేనమామ,  కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఈరోజు  కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో   సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత రవీంద్రనాధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్య వెనుక అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపధ్యంలో సీబీఐ రవీంద్రనాధ్ రెడ్డిని విచారణకు పిలిచింది. ఈ కేసులో కుట్రకోణంపై సీబీఐఅధికారులు రవీంద్రనాధ్ రెడ్డిని విచారిస్తున్నారు. కాగా…వివేకా హత్య కేసులో ఎమ్మెల్యే స్ధాయి వ్యక్తి సీబీఐ ఎంక్వైరీకి హాజరు కావటం ఆసక్తిని రేపింది.