మహిళా అటెండర్ పై వీఆర్ఏ లైంగిక వేధింపులు 

కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది.

  • Publish Date - January 19, 2019 / 10:44 AM IST

కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది.

చిత్తూరు : కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకొచ్చింది. ఓ మహిళా అటెండర్ పై వీఆర్ఏ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కడప జిల్లాలోని కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో భవ్య అనే మహిళా అటెండర్ గా పని చేస్తోంది. వీఆర్ఏ ఆనంద్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అటెండర్ భవ్య ఆరోపిస్తున్నారు. చాలా కాలంగా లైంగిక వాంఛ తీర్చాలని తనను వేధిస్తున్నాడని తెలిపింది. ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై అటెండర్ భవ్య, వీఆర్ఏ ఆనంద్ కుప్పం పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారిస్తున్నారు.