కిడారి హత్య కేసులో మావోయిస్టు అరెస్టు

  • Publish Date - April 27, 2019 / 03:14 PM IST

విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య కేసులో పాల్గోన్న జయరాం కిల్లాను ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు. ఏవోబీలో  కూంబింగ్ నిర్వహిస్తున్న  పోలీసులు మావోయిస్టు మిలీషియా సభ్యుడు జయరాంను పట్టుకున్నారు.  విచారణ కోసం ఎన్ఐఏ కు అప్పగించారు. ఇప్పటికే ఈకేసులో కొందరిని పోలీసులు అరెస్టు చేయటం జరిగింది.  ఈహత్య కేసులో పాల్గోన్న నిందితులందరినీ ఒక్కొరొక్కరుగా పోలీసులు అరెస్టు చేయటం జరుగుతోంది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కిడారి, సోమ హత్య కేసుకు కారణాలు ఏమిటి, ఎవరెవరు పాల్గోన్నారు, అసలు ఎందుకు హత్య చేశారు, అనే విషయాలను పోలీసులు రాబడుతున్నారు.  జయరాం కిల్లా మిలీషియా సభ్యుడుగా  పని చేశాడు.  కొన్నిసంఘ విద్రోహక చర్యల్లో కూడా ఇతను పాల్గోన్నాడు. ఇతని నుంచి మరింత సమాచాంరం రాబట్టే పనిలో ఎన్ఐ ఏ అధికారులు ఉన్నారు. 2018వసంవత్సరం సెప్టెంబర్ 23న అరకులోయలోని  డుమ్రిగూడ మండలం లివిట్టిపుట్ట వద్ద మావోయిస్టులు కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోమలను దారుణంగా కాల్చి చంపారు.