ఆమె ఆరోపణలపై జానీ మాస్టర్ ఎందుకు స్పందించడం లేదు? తప్పు చేశాడు కాబట్టే పారిపోయాడా? అసలు జానీ ఎక్కడ..

టాలీవుడ్ లో సంచలనంగా మారిన ఈ కేసులో.. జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది..

ఆమె ఆరోపణలపై జానీ మాస్టర్ ఎందుకు స్పందించడం లేదు? తప్పు చేశాడు కాబట్టే పారిపోయాడా? అసలు జానీ ఎక్కడ..

Updated On : September 19, 2024 / 1:42 AM IST

Jani Master Row : ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నా జానీ మాస్టర్ ఎందుకు స్పందించడం లేదు? జానీ మాస్టర్ నిజంగానే అమ్మాయిని లైంగికంగా వేధించాడా? తప్పు చేయకపోతే తనపై వస్తున్న ఆరోపణలను జానీ ఎందుకు ఖండించడం లేదు? తప్పు చేశాడు కాబట్టే జానీ పారిపోయాడా? ఇంతకు జానీ మాస్టర్ ఎక్కడున్నట్లు? టాలీవుడ్ లో సంచలనంగా మారిన ఈ కేసులో.. జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది..

Also Read : “నా వద్ద ఉన్న ఆయుధాలతో వీళ్లని చంపేస్తా”.. అంటూ కొందరి పేర్లు రాసిపెట్టుకున్న 11 ఏళ్ల పిల్లాడు.. అరెస్ట్

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు మరో మలుపు తిరిగింది. జానీ మాస్టర్ పై పోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్ లో తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు జానీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

పూర్తి వివరాలు..

కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా కేసును లవ్ జిహాద్ కేసుగా అభివర్ణించారు బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి. నిందితుడు జానీ నెల్లూరులో ఉన్నాడని తెలిసినా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. జానీ కేసుపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ముస్లిం అబ్బాయిలు హిందువు అమ్మాయిలను లవ్ ట్రాప్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. జానీ కేసులో బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు. లేకపోతే బీజేఎంఎం తరుపున బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తేల్చి చెప్పారు.

 

లవ్ జిహాద్ పేరుతో జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ ని లైంగికంగా వేధించారని ఆరోపించారు కరాటె కల్యాణి. మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. సభ్య సమాజం తలదించుకునే పని జానీ చేశారని అన్నారు. ఒకవేళ జానీ తప్పు చేయకుంటే దీని వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణ చేపట్టాలని కరాటె కల్యాణి డిమాండ్ చేశారు.

 

లవ్ జిహాద్ పేరుతో జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ ని లైంగికంగా వేధించారని ఆరోపించారు కరాటే కల్యాణి. మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. సభ్య సమాజం తలదించుకునే పని చేశారని జానీపై మండిపడ్డారు. ఒకవేళ జానీ తప్పు చేయకుంటే దీని వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణ చేపట్టాలని కరాటే కల్యాణి డిమాండ్ చేశారు.