చంపేశాడా : సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలు ఏమైంది

హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి అతి దారుణంగా చంపినట్టు పోలీసుల విచారణలో శ్రీనివాస్ రెడ్డి అంగీకరించాడు. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి నేరచరిత్ర గురించి పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్ రెడ్డికి లవ్ యాంగిల్ ఉందని గుర్తించారు. అతడికి ఓ లవర్ ఉందని పోలీసులకు తెలిసింది. వేములవాడలో ఓ యువతిని ప్రేమించాడని, ఆమెను మాత్రం చంపలేదని పోలీసులు మొదట అనుకున్నారు. తీరా దర్యాప్తు చేశాక, ఆమెను కూడా చంపేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీనివాస్ రెడ్డి మొబైల్ కాల్ డేటాలో 60 మంది అమ్మాయిల పేర్లు ఉన్నాయి. అతని ఫేస్‌బుక్‌లో 600 మంది అమ్మాయిలు ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఆ అకౌంట్ల ఆధారంగా పోలీసులు… నిజామాబాద్, బాసర, వేములవాడ వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఎవరినైనా చంపేశాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలిగా భావిస్తున్న యువతి కోసం పోలీసులు వేములవాడలో విచారణ చేశారు. అయితే ఆమె వేములవాడలో లేదని తెలిసింది. దీంతో ఆమె ఎక్కడికన్నా వెళ్లిపోయి ఉంటుందని అనుకున్నారు. కట్ చేస్తే.. కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 21న వేములవాడలోని అగ్రహారం గుట్టల్లో ఓ యువతి డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఆమె గురించి ఎలాంటి వివరాలు లేవు. ఆమె శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను కూడా శ్రీనివాస్ రెడ్డి చంపేశాడా అని పోలీసులు డౌట్ పడుతున్నారు. క్లారిటీ కోసం లోతుగా దర్యాఫ్తు చేపట్టారు. అసలు శ్రీనివాస్ రెడ్డి ప్రేమించిన యువతి బతికే ఉందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ యువతితో శ్రీనివాస్ రెడ్డి దిగిన ఫొటోలు ఫేస్‌బుక్‌లో ఉన్నాయి. వాటి ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డిని కస్టడీకి తీసుకున్న తర్వాత… అన్ని ప్రశ్నలకూ సమాధానాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు మైనర్లను శ్రీనివాస్ రెడ్డి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. శ్రీనివాస్ రెడ్డిని కరుడుగట్టిన నిందితుల కోసం కేటాయించిన బ్యారక్‌లోని ప్రత్యేక సెల్‌లో పటిష్ట బందోబస్తు మధ్య వరంగల్ సెంట్రల్ జైల్ లో ఉంచారు. అతని నేరచరిత్ర ఆధారంగా సాధారణ ఖైదీలతో కలవనీయకుండా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ముగ్గురు అమ్మాయిలను అతికిరాతకంగా చంపిన శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చెయ్యాలని, ఉరి తియ్యాలని డిమాండ్లు వస్తున్నాయి.