భార్యలను వదిలి వెళ్లిన NRI భర్తల పాస్ పోర్టులు రద్దు : కేంద్ర మంత్రి మేనకా గాంధీ

  • Publish Date - March 4, 2019 / 01:31 PM IST

ఢిల్లీ : భారతీయ మహిళలను పెళ్లిచేసుకుని, విదేశాలకు తీసుకెళ్లకుండా, వదిలి వెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది.  భార్యలను ఇండియాలో వదిలేసి, విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్నారై భర్తల పాస్ పోర్టులు రద్దు చేసినట్లు  కేంద్ర  మహిళా,శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ చెప్పారు.
Also Read : అభినందన్ దేశభక్తి : డిశ్చార్జ్ చేయండి.. విధుల్లో చేరాలి

ఎన్నారై పెళ్ళిళ్ళలో జరగుతున్నమోసాలను అరికట్టటానికి, ఎన్ఆర్ఐ భర్తలపై కఠినచర్యలు తీసుకునేందుకు  కేంద్ర ప్రభుత్వం ఒక  బిల్లును ఇప్పటికే రూపోందించింది.  ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది, కానీ బిల్లును ఎగువసభ ఆమోదించలేదు.  అయితే అప్పటి వరకు వీరిపై  కఠిన చర్యలు తీసుకునేందుకు ఇంటిగ్రేటెడ్‌ నోడల్‌ ఏజెన్సీని కేంద్రం ఏర్పాటు చేసింది. 

ఈ ఏజెన్సీ ద్వారా  భార్యలను విడిచి పెట్టిన ఎన్నారై భర్తలపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు అలాంటి 45 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను విదేశీ వ్యవహారాల శాఖ రద్దు చేసినట్లు మేనకా గాంధీ చెప్పారు. రాజ్యసభలో రాఫెల్ కేటాయింపులపై  సభ దద్దరిల్లడంతో బిల్లు చర్చకు రాలేదు. దీనితో పాటు తలాక్ బిల్లు కూడా ఆమోదం పొందలేదు. ఇటువంటి కీలకమైన బిల్లులు ఆమోదం పొందక పోవటంతో  ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. 
Also Read : పాక్ కు బుద్ధి చెప్పాల్సిందే : ఐరాస వద్ద నిరసల హోరు