Mancherial ACP : భార్య దొంగతనాలు చేస్తుంటే..భర్త బాడీగార్డ్

భార్య లోనికి వెళ్లి..నగదు, బంగారం, విలువైన వస్తువులు చోరీ చేసేది. భార్య చోరీలకు పాల్పడుతుంటే..ప్రసాద్ ఇంటి బయట కాపాలాగా ఉండేవాడు.

Wife And husband Arrested : దొంగతనం చేయడం తప్పు అని చెప్పాల్సింది పోయి..భార్యకు సపోర్టుగా నిలిచాడో ఓ భర్త. భార్య చోరీలకు పాల్పడుతుంటే..ఆ భర్త కాపలాగా వ్యవహరిస్తుంటాడు. దొంగతనాలకు పాల్పడుతన్న ఈ దంపతులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. ఈ  ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. సుమారు ఏడు ఇండ్లలో దొంగతనాలు చేసినట్లు మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు వెల్లడించారు.

Read More : Total Global Population on That Day: మీరు పుట్టిన సమయంలో ప్రపంచ జనాభా ఎంతుందో తెలుసా.. ఒక్క క్లిక్ అంతే

మంచిర్యాల జిల్లాల బెల్లంపల్లి మండలంలో బట్వాన్ పల్లికి చెందిన తాళ్లపల్లి ప్రసాద్, ధనలక్ష్మీ దంపతులు. వీరిది ప్రేమ వివాహం. విజయవాడలో పెళ్లి చేసుకున్న అనంతరం నుంచి మంచిర్యాలకు వచ్చి ఇక్బాల్ అహ్మద్ నగర్ లో ఓ రూమ్ ను అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. బతుకుదెరువు కోసం ధనలక్ష్మీ గాజులు అమ్ముతుంటే..ప్రసాద్ మంచిర్యాల బస్టాండులో కూల్ డ్రింక్స్ అమ్ముతూ జీవనం సాగించే వారు. కానీ..వ్యాపారంలో వచ్చే డబ్బులు సరిపోలేదు. జల్సాలు చేసేందుకు వీలు కాలేదు. దీంతో దొంగతనాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Read More : Venkatrama Reddy : అందుకే రాజీనామా, కేసీఆర్ ఆదేశాలు రాగానే టీఆర్ఎస్‌లో చేరతా

తాళం వేసి ఉన్న ఇళ్లను పగలు సమయంలో ప్రసాద్ గుర్తించే వాడు. రాత్రి వేళ భార్యభర్తలిద్దరూ అక్కడకు చేరుకుని…ఇంటి తాళాలు పగులగొట్టి భార్య లోనికి వెళ్లి..నగదు, బంగారం, విలువైన వస్తువులు చోరీ చేసేది. భార్య చోరీలకు పాల్పడుతుంటే..ప్రసాద్ ఇంటి బయట కాపాలాగా ఉండేవాడు. వచ్చిన డబ్బుతో ఫుల్ ఎంజాయ్ చేసేవారు. అయితే…స్థానికంగా ఉన్న మార్కెట్ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు వీరిని చూసి అనుమానం కలిగింది. వెంటనే వారిని పట్టుకుని విచారించగా..దొంగతనాల విషయం చెప్పారు. నిందితుల వద్ద రూ. 4 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ. 9 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు మంచిర్యాల ఏసీపీ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు