wife killed her husband : రూ.6లక్షలు సుపారీ ఇచ్చి భర్త హత్య..రోడ్డుప్రమాదంగా చిత్రీకరణ

Husband Murder

wife brutally killed her husband, with contract killers  : మానవ సంబంధాలన్నీ మనీ బంధాలై పోతున్న ఈ రోజుల్లో ఆస్తికోసం భార్య, కొడుకు కలిసి సుపారీ ఇచ్చి భర్తను హత్యచేయించిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.
బెంగుళూరు వైట్ ఫీల్డ్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే గుంజూరుకు చెందిన సుబ్బరాయప్ప అనే వ్యక్తి ఇటీవల హత్యకు గురయ్యాడు. వైట్ ఫీల్డ్ సమీపంలో మృతదేహం లభ్యం అయ్యింది. భార్య యశోదమ్మ, కుమారుడు దేవరాజ్ అందరికీ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పారు.

ట్రాఫిక్ పోలీసులు విచారించగా సుబ్బరాయప్ప మరణించిన రోజు ఎటువంచి రోడ్డు ప్రమాదం జరగలేదని గుర్తించారు. దీంతో పోలీసులు మృతుడి సెల్ ఫోన్ కాల్ లిస్టు పరిశీలించగా చివరిగా అనిల్ అనే వ్యక్తి కాల్ చేసినట్లుగుర్తించారు. అనిల్, సుబ్బరాయప్పను స్కార్పియోలో తీసుకువెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా గుర్తించారు.

అనిల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నగేష్. ధనుష్,సునీల్ కుమార్ అనే వారితో కలిసి హత్య చేసినట్లు చెప్పాడు. హత్య చేసేందుకు సుబ్బరాయప్ప భార్య, కొడుకు రూ.6లక్షలు సుపారి ఇచ్చిట్లు తెలిపారు. యశోదమ్మ, దేవరాజ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా…. ఆస్తిగొడవలే కారణమని తెలిపారు. కేసునమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.