Husband Suicide : మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం.. తీవ్ర మనస్తాపంతో భర్త ఆత్మహత్య, సెల్ఫీ వీడియో
సరూర్ నగర్ లో దారుణం జరిగింది. భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, తన పిల్లలను తనకు కాకుండా చేస్తోందంటూ..

Husband Suicide : హైదరాబాద్ సరూర్ నగర్ లో దారుణం జరిగింది. భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలు తీసింది. భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, తన పిల్లలను తనకు కాకుండా చేస్తోందంటూ శేఖర్ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వెళ్లబోసుకున్నాడు.
ఆదిలాబాద్ కు చెందిన గూడురు శేఖర్, నాగాంజలికి 2014లో వివాహమైంది. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి అయిన నాగాంజలికి నాబార్డ్ ఉద్యోగితో వివాహేతర సంబంధం ఏర్పడిందని భర్త శేఖర్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై శేఖర్ తన భార్యను నిలదీశాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
అయితే, పెద్దలు పంచాయితీ చేసి ఇద్దరి మధ్య రాజీకుదిర్చారు. అయినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పాటు పిల్లలను తన దగ్గరికి రానివ్వకపోవడంతో శేఖర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య మోసం చేసిందంటూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
”ఈ అమ్మాయి బ్యాంకులో కనిపించేంత మంచిది కాదు. నేను చనిపోతూ అబద్దాలు చెప్పను. పోలీసులు కచ్చితంగా దర్యాఫ్తు చేయాలి. వాడు హైటెక్నాలజీ. ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివాడు. వాడు, ఈ అమ్మాయి పన్నిన పన్నాగం. గత నాలుగేళ్లుగా చేస్తున్న పన్నాగం ఇది. పోలీసులు మొత్తం దర్యాఫ్తు చేయాలి. నా పిల్లలను మీరే కాపాడాలి. వాళ్లిద్దరూ ఏకమై పిల్లలను వాళ్ల అమ్మా నాన్నల దగ్గర పడేయాలని అనుకుంటున్నారు. నేను నిజం చెబుతున్నా సర్. నా పిల్లలు అన్యాయం అయిపోతారు” అంటూ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో బోరున విలపించాడు శేఖర్.