Woman doctor Ordered lipstick lost Money
Woman doctor Ordered lipstick lost Money : ఆమె ఓ డాక్టర్. ముంబైకు చెందిన ఆమె ఆన్ లైన్ లో ఓ లిప్ట్ స్టిక్ ఆర్డర్ చేసింది. దాని విలువ రూ.300లు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ రూ.300లు లిప్ స్టిక్ ఆర్డర్ చేసి లక్ష రూపాయలు పోగొట్టుకుంది. ఆమె ఫోన్ కు ఆర్డర్ చేసిన లిప్ స్టిక్ కు డెలివరికి సంబంధించి ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ పరిశీలించిన ఆమెను బుట్టలో వేసే ప్రక్రియ మొదలైందన తెలుసుకోలేక ఆ సందేశం సూచనల మేరకు ఓ వ్యక్తికి ఫోన్ చేసి ఇరుక్కుపోయింది. ఫలితంగా లక్ష రూపాయలు పోగొట్టుకుంది.
నవీ ముంబైకి చెందిన ఓ మహిళా డాక్టర్ ఇదే నెల 2న ఆన్ లైన్ లో లిప్ స్టిక్ ఆర్డర్ చేశారు. కొన్ని రోజుల తరువాత ఆమె ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. మీ ఆర్డర్ వచ్చిందని..కానీ కొన్ని వివరాల కోసం తమ కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ ప్రతినిథితో మాట్లాడలని ఉంది. దీంతో ఆమె కొరియర్ కంపెనీ నంబర్‌ను సంప్రదించారు. అటువైపు నుంచి స్పందించిన వ్యక్తి తానే కస్టమర్ కేర్ ప్రతినిథిని..మీకేం కావాలో చెప్పండి మాడమ్..మీకు ఏవిధంగా సహాయపడగలను..? అంటూ వినయంగా అడిగాడు.దానికి ఆమె తాను ఆర్డర్ చేసిన విషయాలు వంటివి వెల్లడించారు.
యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్టు.. అసలు ఏం జరిగిందంటే?
దానికి సదరు బ్యక్తి మీ ఆర్డర్ హోల్డ్‌లో ఉంచబడిందని..దానిని కన్ఫామ్ కోసం మీ నుంచి జస్ట్ రెండు రూపాయలు పంపిస్తే క్లియర్ అయిపోతుందని..దాని కోసం బ్యాంక్ వివరాలు ఫిల్ చేయాలని ఓ వెబ్ లింక్ సెండ్ చేశాడు. అంతేకాదు మీకు కలిగిన అకర్యానికి చింతిస్తున్నాం మాడమ్ మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటున్నాం అంటూ అత్యంత వినయంగా మాట్లాడుతు క్షమాపణలు కూడా చెప్పాడు. అతని మాటల్ని ఆమె నమ్మింది. పైగా జస్ట్ రెండు రూపాయలే కదాని ఆమె అతను పంపించిన లింక్ ను క్లిక్ చేశారు.
దీంతో ఆమె మొబైల్‌లో ఒక యాప్ డౌన్‌లోడ్ అయ్యింది. కానీ ఆ యాప్ ను ఆమె పెద్ద విషయంగా అనుకోలేదు. తాను మరో తప్పు చేస్తున్నానని గ్రహించలేకపోయారామె. నవంబర్ 9న ఆమె బ్యాంకు అకౌంట్ లో రూ.95 వేలు.. రూ.5 వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ లు వచ్చాయి. దీంతో ఆమెకు అసలు విషయం అర్థమైంది. అప్పటికే తాను మోసపోయానని తెలుసుకున్నారు. వెంటనే డాక్టర్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.