Live-in Relationship : సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన ప్రియుడు

సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం పెరగటంతో ఆ మహిళను, ఆమె ఐదేళ్ల కుమార్తె ఎదుటే హత్య చేసిన  ఉదంతం ముంబైలో వెలుగు చూసింది.

Mumbai Murder

Live-in Relationship :  సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం పెరగటంతో ఆ మహిళను, ఆమె ఐదేళ్ల కుమార్తె ఎదుటే హత్య చేసిన  ఉదంతం ముంబైలో వెలుగు చూసింది.

అంథేరి ఈస్ట్ సంఘర్ష్ నగర్‌లో  నివసించే మనీషా జాదవ్(29) అనే మహిళ.. టీవీ రిపేర్లు చేసే రాజు నీలేతో(43) కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది.  మనీషా ఐదేళ్ల కూతురు కూడా వారితోనే నివసిస్తోంది.  వీరిద్దరికీ ఇంతకు ముందు వివాహాలు జరిగి వారి, వారి జీవిత భాగస్వాముల నుండి విడిపోయి వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారని తెలిసింది.
Also Read : Prostitution Racket : హైదరాబాద్ శివారులో వ్యభిచార ముఠా గుట్టురట్టు
రాజు కు   మనీషా ప్రవర్తనపై  ఇటీవల అనుమానం కలిగింది. ఈక్రమంలో ఆమెతో  తరచూ గొడవపడసాగాడు.  బుధవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో రాజు మనీషాతో మళ్లీ ఇదే విషయమై గొడవపడ్డాడు. ఆగొడవలో ఆవేశం పట్టలేని రాజు మనీషా తలపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అనంతరం కత్తితీసుకుని ఆమె ముక్కు చెవులు,ఛాతీ, కడుపు భాగంలో పొడిచాడు.

ఈతతంగాన్ని అంతా అక్కడే ఉండి చూస్తున్న ఆమె కూతురు భయంతో గట్టిగా  అరవటంతో  చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. వారు పోలీసులకు సమాచారం అందించటంతో  ఘటనా స్ధలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులను చూసిపారిపోవాలని చూసిన నిందితుడ్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.