Baby Sale For Second Marriage : రెండో పెళ్లి కోసం నీచానికి దిగజారిన మహిళ

తమిళనాడులోని  విరుదు నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తనుంచి విడిపోయిన మహిళ రెండో పెళ్లి చేసుకోటానికి   9 నెలల కొడుకుని రూ. 3లక్షలకు అమ్మేసి మాతృత్వానికే మచ్చ తెచ్చింది.

Baby Sale For Second Marriage : తమిళనాడులోని  విరుదు నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తనుంచి విడిపోయిన మహిళ రెండో పెళ్లి చేసుకోటానికి   9 నెలల కొడుకుని రూ. 3లక్షలకు అమ్మేసి మాతృత్వానికే మచ్చ తెచ్చింది.

విరుదు నగర్ జిల్లాలోని   అరుప్పుకొట్టైకి  చెందిన మణికందన్(38) కి ట్యూటికోరన్ జిల్లాకు  చెందిన జెబమలార్(28) అనే యువతితో 2019లో వివాహం అయ్యింది.  వీరికి ఒక కుమారుడు పుట్టాడు.  ఇటీవలి  కాలంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో  జెబమలార్ బిడ్డను తీసుకుని ట్యూటికోరన్ లోని కొతనర్   కాలనీలో ఉన్నతల్లితండ్రుల వద్దకు వచ్చేసింది.

మణికందన్ తో   విడాకులు రావటంతో జెబమలార్ కు రెండో పెళ్లి చేయటానికి ఆమె తల్లి తండ్రులు ప్రయత్నాలు చేయసాగారు. ఈక్రమంలో ఆమెకు బిడ్డ ఉండటంతో ఆమెను వివాహం చేసుకోటానికి కొందరు నిరాకరించారు. దీంతో కన్నబిడ్డ ఆమెకు అడ్డం అయ్యాడు. దీంతో బిడ్డను అమ్మేయాటానికి  నిర్ణయించుకుంది.
Also Read : Fraudsters Cheating Rs.12 Lakhs : పార్ట్ టైం జాబ్ పేరుతో రూ.12 లక్షలు దోచేశారు
సెప్టెంబర్ 23న తన బిడ్డను అమ్మటానికి తల్లి తండ్రులు   సోదరులతో కలిసి బ్రోకర్లు జేసుదాస్ , కార్తికేయలను సంప్రదించింది. వారు బిడ్డను కన్యాకుమారి జిల్లాకు చెందిన పిల్లలు లేని దంపతులు హెచ్. సెల్వమణి (52) మరియు అతని భార్య శ్రీదేవి (40) కి  రూ. 3 లక్షలకు విక్రయించారు. ఈవిషయం  జెబమలార్ మొదటి భర్త మణికందన్ కు తెలిసింది. వెంటనే అతను జెబమలార్ ఇంటికి వచ్చి చూడగా అక్కడ తన బిడ్డ కనిపించలేదు.

మాజీ భార్యను అడగ్గా అమ్మేశానని సమాధానం చెప్పింది. ‘‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. వచ్చి నీ కొడుకుని తీసుకెళ్లు అని చెప్పి ఉంటే.. నేను వచ్చి తీసుకువెళ్లే వాడినికదా .. అమ్మేయడానికి మనసెలా వచ్చింది’’ అని జబామలర్‌తో గొడవ పడ్డాడు. వెంటనే తన బిడ్డను రక్షించాలని కోరుతూ సిప్ కాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడ్ని రక్షించారు. బాలుడ్ని విక్రయించిన బ్రోకర్లతోసహా కొనుగోలు చేసిన దంపతులను అరెస్ట్ చేశారు.వ ముగ్గురిని కోర్టు ముందు హాజరు పరిచి జ్యూడీషియల్ కస్టడీకి పంపారు. తండ్రి అందించిన రుజువులు పరిశీలించి బిడ్డను మణికందన్ కు అప్పగించారు. పరారీలో ఉన్న జెబమలార్ ఆమె కుటుంబ సభ్యులకోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు