Young couple commits suicide : వివాహేతర సంబంధం… ప్రేమజంట ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. జక్రాన్ పల్లి మండలం సికింద్రపూర్ గ్రామ శివారులోని దేవాలయంలో వీరు ఈ అఘాయుత్యానికి ఒడిగట్టారు.

Love Couple Suicide

Young couple commits suicide due to Extra marital relation : నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. జక్రాన్ పల్లి మండలం సికింద్రపూర్ గ్రామ శివారులోని దేవాలయంలో వీరు ఈ అఘాయుత్యానికి ఒడిగట్టారు.

ఆర్మూర్ మండల ఆలూర్ గ్రామానికి చెందిన చిత్తరి సాయికుమార్(30) శైలజ(28) అనే వారు గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివాహేతర సంబంధమే వీరి ఆత్మహత్యకు కారణమనిపోలీసులు తెలిపారు.

మృతులిద్దరికీ గతంలో వేర్వేరు వ్యక్తులతోవివాహం అయ్యింది. కాగా కొన్నాళ్లక్రితం శైలజ భర్త మరణించాడు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.