Love Failure : ప్రియురాలు ఫోన్ లిఫ్ట్ చేయలేదని… ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ప్రేమ అంటే అందరికీ ఒక ఆట వస్తువు అయిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా అవతలివారి ఇష్టా ఇష్టాలను గౌరవించకుండా ప్రేమిస్తున్నామని చెప్పేస్తారు. కాదంటే నిండు ప్రాణాలు బలి తీసుకుంటారు.

Love Failure : ప్రియురాలు ఫోన్ లిఫ్ట్ చేయలేదని… ఆత్మహత్య చేసుకున్న యువకుడు

young man commits suicide

Updated On : February 22, 2022 / 3:02 PM IST

Love Failure :  ప్రేమ అంటే అందరికీ ఒక ఆట వస్తువు అయిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా అవతలివారి ఇష్టా ఇష్టాలను గౌరవించకుండా ప్రేమిస్తున్నామని చెప్పేస్తారు. కాదంటే నిండు ప్రాణాలు బలి తీసుకుంటారు. ప్రేమించిన ప్రియురాలు ఫోన్ లిప్ట్ చేయటంలేదని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా, ఘన్‌పూర్‌లో లో చోటు చేసుకుంది.

బీహార్ కు చెందిన అమిత్ కుమార్(20) అనే యువకుడు ఘన్ పూర్ లోని రైసు మిల్లులో నాలుగునెలల నుంచి ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అతని స్వగ్రామమైన మధువనిలోని బాలువాటోల్‌ గ్రామంలో ఒక యువతితో అతను ప్రేమలో ఉన్నాడు. రోజూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడేవాడు. కొద్ది రోజులుగా ఆమె ఫోన్ చేయటం లేదని మనస్తాపానికి గురయ్యాడు. స్నేహితుల ద్వారా ఎంక్వైరీ చేయగా వారు…ఆ యువతి వేరొకరతో ప్రేమలో ఉందని చెప్పారు. దీంతో అమిత్ కుమార్ మరింత ఆవేదనకు గురయ్యాడు.

Also Read : Hyderabad : టైర్ల లారీ చోరీ కేసులో నలుగురు నిందితులు అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు

ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు పలు మార్లు ఫోన్ చేసినా ఆమెనుంచి సమాధానం లేదు. దీంతో అమిత్ కుమార్ రైస్ మిల్లులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మర్నాడు ఉదయం మిల్లుకు వచ్చిన ఇతర కార్మికులు గమనించి మిల్లు యజమానికి సమాచారం అందించారు. యజమాని పోలీసులకు సమాచారం అందించటంతో ఘటనా స్ధలానికి వచ్చి పంచానామా నిర్వహించారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తోటి కార్మికుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.