Khamma Tragedy
Khammam : ఖమ్మంలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ శుభ్రం చేసే సమయంలో అందులోని పైపులైన్ లోకి జారిపడి మున్సిపల్ కార్మికుడు మృతి చెందాడు. నయా బజార్ కాలేజీ దగ్గర వాటర్ ట్యాంక్ ను ఈరోజు కొందరు కార్పోరేషన్ సిబ్బంది శుభ్రపరిచే పని చేపట్టారు.
ఆ క్రమంలో వారిలో పని చేస్తున్న చిర్రా సందీప్ (23) అనే యువకుడు ప్రమాదవశాత్తు పైప్ లోకి జారిపోయాడు. దీంతో అతడిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే మూడు గంటల పాటు ప్రయత్నించినా అతడి ఆచూకీ తెలియలేదు.
చివరికి పైప్‌లైన్‌ను తవ్వి సందీప్ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే సందీప్ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సందీప్‌తో పాటు మరో నలుగురు కార్మికులు ఉన్నారని, వారు ఎవరూ కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.
Also Read : Y.S.Vivekananda Reddy : వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ అధికారులు