Karnataka Student kill : బలవంతంగా తాళి కట్టబోయాడు… వద్దనే సరికి వెంటపడి పొడిచి చంపాడు

కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తాను ప్రేమించిన అమ్మాయి వద్దంటున్నా ఆమెకు బలవంతంగా తాళి కట్టబోయాడు. అతడి నుంచి తప్పించుకుని పారిపోబోతే వెంటపడి కత్తితో పొడిచి చంపిన ఘటన తుమకూ

Young Man Harassed And Killed Girl, Stabbing Karnataka

Karnataka : Young Man killed a student, stabbing : కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తాను ప్రేమించిన అమ్మాయి వద్దంటున్నా ఆమెకు బలవంతంగా తాళి కట్టబోయాడు. అతడి నుంచి తప్పించుకుని పారిపోబోతే వెంటపడి కత్తితో పొడిచి చంపిన ఘటన తుమకూరు జిల్లాలోని దొడ్డగుళలో చోటు చేసుకుంది.

తుమకూరు జిల్లాలో నివసించే ఈరణ్ణ (21)రత్న సంద్రగొల్లరహట్టికిచెందిన పీయూసీ చదివే విద్యార్ధిని కావ్యను ప్రేమించాడు. కానీ ఆమె అతని ప్రేమను అంగీకరించలేదు. తనను ప్రేమించమని వెంటపడేవాడు. ఈరణ్ణ ఎన్నిసార్లు అడిగినా ఆమె నో అనే చెప్పేది. దీంతో ఈరణ్ణ యువతిపై పగ పెంచుకున్నాడు.

ఏప్రిల్ 6 సోమవారం ఉదయం కావ్యా కాలేజీకి వెళుతున్న సమయంలో ఆమెను అడ్డగించాడు. నిన్ను ఎలాగైనానా దాన్ని చేసుకుంటా అని చెప్పి తనతో తెచ్చుకున్నతాళి కట్టబోయాడు. అందుకు ఆమె అభ్యంతరం చెప్పి పారిపోబోయింది. యువతి పారిపోబోతున్నా వెంటాడి కత్తితో పొడిచి చంపాడు. ఇది చూసిన సహచర విద్యార్ధులు కావ్య కుటుంబానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా.. పరారీలో ఉన్న ఈరణ్ణపై కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు.