Chhattisgarh
Chhattisgarh : పోలీసు ఇన్ ఫార్మర్ అనే నెపంత 28 ఏళ్ళ యువకుడిని మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. రాయ్‌పూర్ కు 200 కిలో మీటర్ల దూరంలోని కోయిలీబేడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బదరంగి గ్రామంలోని మార్కెట్ లో …. సోమవారం రాత్రి మావోలు మహేష్ బఘేల్(28) అనే యువకుడిని కాల్చి చంపినట్లు కాంకేర్ పోలీసు సూపరింటెండెంట్ శలభ్ సిన్హా చెప్పారు.
ఘటనా స్ధలంలో మావోయిస్టులు ఎటువంటి లేఖ వదిలి పెట్టకపోవటంతో…. మృతుడు పోలీసు ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నాడని భావించి మావోయిస్టులు హత్య చేసినట్లు తెలుస్తోందన్నారు.
Also Read : Mylavaram : మైలవరానికి వసంత.. పెడనకు జోగి…స్పష్టం చేసిన పెద్దిరెడ్డి
రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో కాల్పులు జరగగానే స్ధానికులు భయాందోళనలకు గురయ్యారు. కాల్పుల ఘటన జరగగానే అప్రమత్తమైన భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు.