Uttar Pradesh : సెల్ఫీ మోజులో పొరపాటున రివాల్వర్ పేలి యువకుడు మృతి

సెల్‌ఫోన్‌లు వచ్చాక సెల్ఫీల మోజు పెరిగి పోయింది. సెల్ఫీ మోజులో వివిధ పరిస్ధితుల్లో  పలువురు మృత్యువాత పడిన వార్తలు వింటూనే ఉన్నాము. 

Uttar Pradesh : సెల్‌ఫోన్‌లు వచ్చాక సెల్ఫీల మోజు పెరిగి పోయింది. సెల్ఫీ మోజులో వివిధ పరిస్ధితుల్లో  పలువురు మృత్యువాత పడిన వార్తలు వింటూనే ఉన్నాము.  తాజాగా…. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌లో సెల్ఫీ తీసుకునే క్రమంలో సెల్‌ఫోన్ క్లిక్ బటన్ నొక్కబోయి  రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కటంతో ఒక యువకుడు ప్రాణాల కోల్పోయాడు.

సుచిత్(17) అనే యువకుడు ఆదివారం ఉదయం   తన గదిలో ఉండి రివాల్వర్ తలవద్ద ఉంచుకుని మరో చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని సెల్ఫీ ఫోటో తీసుకుంటున్నాడు.  అయితే పొరపాటున ఫోన్ లోని క్లిక్   బటన్ నొక్కే  బదులు, రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కాడు. దీంతో బుల్లెట్ అతడి తలలోంచి దూసుకెళ్లింది.  తుపాకీ పేలిన శబ్దం విన్న సుచిత్ కుటుంబ సభ్యులు వెంటనే అతని గదిలోకి వచ్చారు.

రక్తం మడుగులో పడి  ఉన్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.  వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. కాగా సుచిత్ గన్ తో   సెల్ఫీ తీసుకుంటూ పొరపాటున మరణించాడా   లేక   గన్ తో   కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అనేది దర్యాప్తు చేస్తామని  సఫీపూర్  పోలీసు  సర్కిల్ ఇనస్పెక్టర్ అంజనీకుమార్ రాయ్ చెప్పారు.

Also Read :Telangana Covid Cases : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

ట్రెండింగ్ వార్తలు