విద్యా రంగంలో సేవలకు అక్షర నీరాజనం.. 10tv Edu Visionary 2025.. ఆదివారం సా.6గంటలకు 10టీవీలో ప్రసారం..

వారి చేతుల మీదగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల విజయాలకు విశిష్టమైన గౌరవం దక్కింది. (10tv Edu Visionary 2025)

విద్యా రంగంలో సేవలకు అక్షర నీరాజనం.. 10tv Edu Visionary 2025.. ఆదివారం సా.6గంటలకు 10టీవీలో ప్రసారం..

Updated On : August 30, 2025 / 7:10 PM IST

10tv Edu Visionary 2025: విద్యా రంగంలో స్ఫూర్తిమంతమైన సేవలకు అక్షర నీరాజనం పట్టింది 10టీవీ. మెరికల్లాంటి విద్యార్థులను తీర్చిదిద్దిన కృషీవలురను ఘనంగా సత్కారం చేసింది. విద్యా దార్శనికుల ఎనలేని ప్రతిభకు 10tv Edu Visionary 2025 ప్రతీకగా నిలిచింది.

10tv Edu Visionary 2025 Coffee Table Book లాంచ్ ఘనంగా జరిగింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత మురళీమోహన్.. లోక్ సత్తా వ్యవస్థాపకులు, రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ్.. సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ వివి లక్ష్మీనారాయణ లాంటి అతిరథ మహా రథులు దీనికి హాజరయ్యారు. వారి చేతుల మీదగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల విజయాలకు విశిష్టమైన గౌరవం దక్కింది.

10tv Edu Visionary 2025 Coffee Table Book Launch కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6 గంటలకు 10టీవీలో ప్రసారం అవుతుంది.

”విద్యార్థుల సందేహాలకు ఈ కాఫీ టేబుల్ బుక్ మంచి సమాధానం. నేను ఎక్కడ చదవాలి, ఏం చదవాలి అన్నది విద్యార్ధుల ముందున్న ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు ఈ కాఫీ టేబుల్ బుక్ సమాధానం అని చెప్పొచ్చు. ఈ కాఫీ టేబుల్ బుక్ లో అనేక విద్యా సంస్థల గురించి మీరు తెలుసుకోబోతున్నారు.

ఆ సంస్థలు ఇంతవరకు ఏం చేశాయి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని క్యాంపస్ ఇంటర్వ్యూలు వచ్చాయి తెలుస్తుంది. దాని వల్ల ఎక్కడ చదవాలి అన్న దానిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంది. పిల్లలు ఏం చదవాలి అన్నది కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు” అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. (10tv Edu Visionary 2025)

Also Read: పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. నెలకు రూ.67 వేల జీతం.. ANGRAUలో జాబ్స్.. పూర్తి వివరాలు మీకోసం