Priyanka Chopra : సైలెంట్ గా ఆఫ్రికాలో మహేష్ – రాజమౌళి సినిమా షూటింగ్..? ప్రియాంక చోప్రా పోస్ట్ వైరల్..
ఆఫ్రికా దేశాల్లో షూటింగ్ చేస్తామని రాజమౌళి కూడా చెప్పాడు. గతంలోనే వెళ్లి కెన్యా షూటింగ్ లొకేషన్స్ చూసుకొని వచ్చాడు. (Priyanka Chopra)

Priyanka Chopra
Priyanka Chopra : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అడ్వెంచరస్ జానర్ లో రాజమౌళి గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరిగింది. ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజున ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ నవంబర్ లో ఇస్తామని ప్రకటించారు. దీంతో నవంబర్ లో ఈ సినిమా గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని టాక్.(Priyanka Chopra)
ఈ సినిమా షూటింగ్ ఆఫ్రికా దేశాల్లో కూడా చేస్తామని రాజమౌళి కూడా చెప్పాడు. రాజమౌళి గతంలోనే వెళ్లి కెన్యా షూటింగ్ లొకేషన్స్ చూసుకొని వచ్చాడు. కెన్యా నైరోబి నేషనల్ పార్క్, అంబాసిలి నేషనల్ పార్క్ లో, అలాగే టాంజానియాతో పాటు మరో ఆఫ్రికా దేశంలో కూడా ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం. ప్రస్తుతం కెన్యాలో ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా చేసేస్తున్నారని టాక్.
Also Read : Allu Ayaan : ఆమె మరణంతో.. బన్నీని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న అల్లు అయాన్.. వీడియో వైరల్..
తాజాగా మహేష్ – రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఆఫ్రికా దేశంలో ఉన్నట్టు, అక్కడ అడవుల్లో ఉన్నట్టు పలు ఫొటోలు షేర్ చేసింది. దీంతో ప్రియాంక చోప్రా షూట్ నిమిత్తమే అక్కడికి వెళ్లినట్టు భావిస్తున్నారు. రాజమౌళి, మహేష్ ఎలాగో ఈ సినిమా అప్డేట్స్ ఇవ్వరు. సినిమా మొదలయిన దగ్గర్నుంచి ప్రియాంకనే ఎక్కడ షూట్ జరిగితే ఆ లొకేషన్ లో ఫొటోలు దిగి షేర్ చేస్తుంది. దీంతో ఆఫ్రికాలో సైలెంట్ గా రాజమౌళి షూటింగ్ చేస్తున్నాడని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ పోస్ట్ కి నమ్రత ఎమోజీలతో రిప్లై ఇవ్వడంతో షూటింగ్ కంఫర్మ్ అని ఫిక్స్ అయిపోయారు.