ఎమ్మెల్యే శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జనసేన కీలక నిర్ణయం
JanaSena MLA Arava Sridhar : ఏపీ రాజకీయాల్లో రైల్వే కోడూరు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు జనసేన పార్టీ అధిష్టానం విచారణకు కమిటీని వేసింది.
MLA Arava Sridhar
JanaSena MLA Arava Sridhar : ఏపీ రాజకీయాల్లో రైల్వే కోడూరు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం సంచలనంగా మారింది. ఓ ప్రభుత్వ ఉద్యోగినిగా చెప్పుకుంటున్న మహిళ ఆయనపై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. వీడియోనుసైతం విడుదల చేసింది. ఈ వీడియోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకోవడంతో విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై పార్టీ అధిష్టానం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read : Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్‌పై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందని జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించడమైందని, వారిలో టి.శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టి.సి. వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. అరవ శ్రీధర్ ఏడు రోజుల్లోగా కమిటీ ముందు హాజరైన వివరణ ఇవ్వాలని సూచించింది.
కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుందని, నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకూ అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని స్పష్టం చేయడమైందని హరిప్రసాద్ పేరుతో విడుదలైన లేఖలో పేర్కొన్నారు.
రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ. pic.twitter.com/Qw9ydOidyg
— JanaSena Party (@JanaSenaParty) January 28, 2026
