Apple iPhone 16 : ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ఈ ఐఫోన్ 16పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16 ధర డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్ మోడల్ రూ. 15వేలు తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లతో ఎలా కొనాలంటే?
Apple iPhone 16
- ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16పై భారీ తగ్గింపు
- రూ.15వేల తగ్గింపుతో రూ.65వేల లోపు ధరకే
- బ్యాంక్ క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు
- పాత స్మార్ట్ఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు
Apple iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే, ఈ ఆఫర్ మీకోసమే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్ 16పై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ రూ.65వేల కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. మీరు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కొనుగోలు చేస్తే ఈ ఐఫోన్ మోడల్ మరింత తగ్గింపు పొందవచ్చు.
ఆపిల్ లేటెస్ట్ A18 ప్రాసెసర్, ఆకర్షణీయమైన కెమెరా సెటప్, అద్భుతమైన OLED డిస్ప్లేతో వస్తుంది. కంటెంట్ క్రియేటర్లు తప్పనిసరిగా కొనాల్సిన ఐఫోన్ ఇది. హై-ఎండ్ iOS ఎక్స్ పీరియన్స్ అందించే ఈ ఐఫోన్ 16 మోడల్ అసలు వదులుకోవద్దు. ఇంతకీ ఈ ఐఫోన్ 16 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 డీల్ :
రూ.79,900 ధరకు లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15వేల తగ్గింపుతో లభిస్తోంది. దాంతో ఈ ఐఫోన్ ధర రూ.64,900కి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. తద్వారా రూ.4వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అన్ని ఇతర ఫోన్ల మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్ కూడా నెలకు రూ.5,409 నుంచి నో-కాస్ట్ ఈఎంఐతో అందిస్తుంది. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.53,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్చేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
ఆపిల్ ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్ అందిస్తుంది. హుడ్ కింద 8GB ర్యామ్ A18 బయోనిక్ చిప్సెట్ ఉంది. ఈ ఐఫోన్ 3,561mAh బ్యాటరీతో వస్తుంది. ఆప్టిక్స్ పరంగా ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
