Annagaru Vostaru : ‘అన్నగారు వస్తారు’ మూవీ రివ్యూ.. కృతిశెట్టి ఫస్ట్ తమిళ్ సినిమా ఎలా ఉందంటే..
నేడు డైరెక్ట్ గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.(Annagaru Vostaru)
Annagaru Vostaru
Annagaru Vostaru : తమిళ్ స్టార్ హీరో కార్తీ – కృతిశెట్టి జంటగా తెరకెక్కిన తమిళ సినిమా ‘వా వాతియార్’. తెలుగులో ఈ సినిమా అన్నగారు వస్తారు అనే పేరుతో రిలీజ్ కావాల్సింది. తమిళ్ లోనే పలు మార్లు వాయిదా పడి సంక్రాంతికి రిలీజయింది ఈ సినిమా. తెలుగులో పలు ఆర్ధిక ఇబ్బందులతో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. నేడు డైరెక్ట్ గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. వా వాతియార్ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. స్టూడియో గ్రీన్ నిర్మాణంలో నలన్ కుమారస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.(Annagaru Vostaru)
కథ విషయానికొస్తే..
రామారావు(కార్తీ) తాతయ్య(రాజ్ కిరణ్) ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో MGR కి పెద్ద ఫ్యాన్. MGR చనిపోయిన రోజే తన మనవడు పుట్టడంతో అన్నగారి అంశతోనే పుట్టాడని ఆయన సినిమాలు చూపిస్తూ మంచి మార్గంలో పెంచుతుంటాడు. లాటరీలో వచ్చిన డబ్బులు కూడా వద్దు, కష్టపడాలి అని రామారావుకు చిన్నప్పుడు తాతయ్య చెప్పడంతో అది నచ్చక రామారావు మారిపోయి అందరిలానే ఉన్నా తాతయ్యకు ఈ విషయం తెలియకుండా మంచివాడిలా నటిస్తాడు. రామారావు పెద్దయ్యాక ఓ అవినీతి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అనుకోకుండా అతను తీసుకున్న ఓ లంచం వల్ల సస్పెండ్ అవుతాడు. ఈ విషయం తాతయ్యకు తెలియకూడదు అని జాగ్రత్త పడతాడు రామారావు.
ఇదే సమయంలో పెద్ద బిజినెస్ మెన్ భక్తవత్సలం(సత్యరాజ్) జనాలకు, పర్యావరణానికి హాని తలపెట్టే ఏదో ప్రాజెక్టు మొదలుపెడతాడు. అందుకు సీఎం పర్మిషన్ కోసం విదేశీయులతో కలిసి కొన్ని వేల కోట్లు ఇవ్వడానికి రెడీ అవుతాడు. ఈ ప్రాజెక్టుని జనాలు వ్యతిరేకిస్తుంటారు. భక్త వత్సలంకు చెందిన ఓ సీక్రెట్ పసుపు ముఖం అనే టీమ్ హ్యాక్ చేసి బయటపెడుతోంది. ఇదే క్రమంలో రామారావు భక్తవత్సలం కూతుర్ని ఓ కేసులో కాపాడి అతనికి దగ్గరయి ఈ పసుపు ముఖం పట్టుకునే టీమ్ లో జాయిన్ అవుతాడు. రామారావు మంచోడిగా మారతాడా? అతని తాతయ్యకు ఈ విషయం తెలుసా? అసలు పసుపు ముఖం టీమ్ ఎవరు? వాళ్ళని రామారావు పట్టుకుంటాడా? అసలు భక్తవత్సలం చేసే ప్రాజెక్టు ఏంటి ? మధ్యలో ఊ(కృతిశెట్టి) ఎవరు? MGR కి ఈ కథకి సంబంధం ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Arijit Singh : ఫుల్ ఫామ్ లో ఉండగా 38 ఏళ్లకే.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ సింగర్.. బాధలో ఫ్యాన్స్..
సినిమా విశ్లేషణ..
కార్తీ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్స్ లో కార్తీ MGR లుక్ లో కనపడటంతో మంచి అంచనాలే నెలకొన్నాయి. కానీ అన్నగారు వస్తారు సినిమాకు ఉన్న ఇబ్బందులతో వాయిదాలు పడటం, తెలుగులో రిలీజ్ అవ్వకపోవడంతో సినిమా పై ఏర్పడ్డ అంచనాలు కూడా పోయాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది.
తమిళ్ స్టార్ హీరో MGR రిఫరెన్స్ తీసుకొనే ఈ సినిమాని నడిపించారు. ఫస్ట్ హాఫ్ హీరో తాతయ్య MGR వీరాభిమాని కావడం, మనవడిని అలాగే పెంచాలనుకోవడం, అది నచ్చక మనవడు నటిస్తూ పెరగడం, అవినీతి పోలీస్ అవ్వడం ఇదంతా ఆసక్తిగానే సాగుతుంది. భక్తవత్సలం వరకు వెళ్లే రామారావు ప్రయాణం కూడా ఆసక్తిగానే సాగుతుంది. ఇక అక్కడ్నుంచి అసలు పాయింట్ చెప్పకుండా కథని ఎటెటో తిప్పేశారు. అసలు భక్తవత్సలం చేస్తున్న ప్రాజెక్టు ఏంటో సినిమా మొత్తంలో ఎక్కడా చెప్పలేదు. దీంతో మెయిన్ పాయింట్ ఏంటో చెప్పకుండా విలన్స్ ని చూపించినట్టు ఉంది. రామారావు తాతయ్య మరణించాక అసలు కథ మొదలవుతుంది.
రామారావు అన్నగారులా మారిపోయి జనాల్ని కాపాడేస్తుంటాడు, ఫైట్స్ చేస్తాడు. అది తాతయ్య ఆత్మ, అన్నగారి ఆత్మ అంటే అది కూడా కాదన్నారు. మరి ఎందుకు మారారు అంటే కారణం చెప్పలేదు. అపరిచితుడు సినిమాలో రాము అపరిచితుడిలా మారినట్టు రామారావు రాత్రిపూట అన్నగారిలా మారి జనాల్ని కాపాడటం చేస్తూ ఉంటాడు. అసలు ఈ సీన్స్ అన్నిటికి చిన్న లాజిక్ కూడా ఉండదు. రామారావు పట్టుకున్న పసుపు ముఖంతోనే అన్నగారు క్యారెక్టర్ లో కలిసి పనిచేయడం ఇంకా విడ్డురం. దీంతో పోలీసులు, విలన్లు అన్నగారు రామారావు ఒకటే అని ఎలా కనిపెడతారు అనేది ఆసక్తిగా నడిపించారు కానీ చివర్లో అది కూడా క్లారిటీ ఇవ్వకుండానే సింపుల్ గా తేల్చేసారు.
ఇక కృతిశెట్టి పాత్ర లేకపోయినా సినిమా నడుస్తుంది కానీ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. ఆమెతో ఉన్న పాటలు కూడా అవసర్లేదు కానీ పెట్టారు. అక్కడక్కడా ఓ 10 నిముషాలు, రెండు పాటల్లో కనిపించి వెళ్ళిపోతుంది కృతి. క్లైమాక్స్ కూడా సరైన ముగింపు ఇవ్వలేదు. ఈ సినిమా తమిళ్ లో డిజాస్టర్ అయింది. ఇప్పుడు తెలుగులో ఓటీటీలో వచ్చినా పెద్దగా మెప్పించలేదు. ఎప్పుడో 1987లోనే మరణించిన తమిళ్ స్టార్ హీరో, ముఖ్యమంత్రిగా చేసిన MGR ఫ్యాన్స్ కోసం ఈ సినిమా తీసినట్టు ఉంది. పైగా తెలుగు డబ్బింగ్ లో MGR ని ఎన్టీఆర్ చేసి, MGR ఫోటోలు చూపిస్తూ ఎన్టీఆర్ కథ చెప్పి, సినిమా అంతా MGR చూపించడం చాలా వరస్ట్ గా ఉంది. ఎలాగో తమిళ్ సినిమా అని తెలుసు అందరికి. అదే పేర్లు, అదే కథ చూపించొచ్చు కానీ తెలుగు డైలాగ్స్ రాసిన వాళ్ళు మితిమీరి వాళ్ళ తెలివి తేటలు చూపించినట్టు ఉంటుంది సినిమా.

నటీనటుల పర్ఫార్మెన్స్..
కార్తీ ఎప్పట్లాగే తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తాడు. MGR లాగే మ్యానరిజం, లుక్స్ చూపించి ఆయన పాత్రలో కూడా మెప్పించాడు. ఇక కృతిశెట్టి రెండు పాటలు నాలుగు సీన్స్ వరకే. తమిళ్ మొదటి సినిమా కూడా కృతికి నిరాశే మిగిల్చింది. సత్యరాజ్ బిజినెస్ మెన్ పాత్రలో బాగానే నటించాడు. MGR ఫ్యాన్ గా, రామారావు తాతయ్యగా రాజ్ కిరణ్ అద్భుతంగా నటించారు. నిజలగల్ రవి, శిల్ప మంజునాథ్, ఆనంద్ రాజ్, కరుణాకరన్, GM ఆనంద్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. MGR సీన్స్ వచ్చినప్పుడల్లా అప్పటి సాంగ్స్, మ్యూజిక్ తో మెప్పించారు. పాటలు యావరేజ్. కార్తీని MGR లుక్ లో చూపించడానికి కాస్ట్యూమ్స్, మేకప్ డిపార్ట్మెంట్స్ బాగానే కష్టపడ్డారు. 1987 సమయంలో జరిగే సీన్స్ లో కూడా ఇప్పటి వస్తువులు ఉండటం గమనార్హం. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. అప్పటి MGR వచ్చి జనాల్ని మంచి మార్గంలో నడిపించాలి అనే కథతో ఓ కమర్షియల్ కథ క్లారిటీ లేకుండా రాసుకొని తెరకెక్కించినట్టు ఉంది ఈ అన్నగారు వస్తారు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘అన్నగారు వస్తారు’ MGR రిఫరెన్స్ లతో నింపేసిన లాజిక్స్, క్లారిటీ లేని తమిళ్ కమర్షియల్ సినిమా.
గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
