Tharun Bhascker Eesha Rebba : తరుణ్ – ఈషా రిలేషన్ నిజమే.. టైం వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాం అంటూ డైరెక్టర్ కామెంట్స్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ ని ఈషారెబ్బతో రిలేషన్ గురించి ప్రశ్నించగా వీరి రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చేసాడు. (Tharun Bhascker Eesha Rebba)

Tharun Bhascker  Eesha Rebba : తరుణ్ – ఈషా రిలేషన్ నిజమే.. టైం వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాం అంటూ డైరెక్టర్ కామెంట్స్..

Tharun Bhascker Eesha Rebba

Updated On : January 27, 2026 / 4:31 PM IST

Tharun Bhascker Eesha Rebba : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ – హీరోయిన్ ఈషారెబ్బ ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి జంటగా ఓం శాంతి శాంతి శాంతిః సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 30న రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో వీళ్లకు ఇదే ప్రశ్న ఎదురవుతుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ ని ఈషారెబ్బతో రిలేషన్ గురించి ప్రశ్నించగా వీరి రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చేసాడు.

Also Read : Srujan Yarabolu : మీరేమన్నా సైంటిస్టులా..? రీమేక్ అన్నందుకు ప్రేక్షకులపై కామెంట్స్ చేసిన నిర్మాత..

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. నేను ఒక మంచి రైట్ టైం కోసం చూస్తున్నాను అది చెప్పడానికి. ఈషా ఒక మంచి అమ్మాయి, మంచి ఫ్రెండ్. ఫ్రెండ్ కంటే ఎక్కువ. గత కొన్నాళ్లుగా తను నాకు అన్నిట్లో సపోర్ట్ గా ఉంది. ఇందులో చెప్పడానికి, దాయడానికి ఏం లేదు. కానీ నేను అనౌన్స్ చేయడానికి రైట్ టైం కోసం చూస్తున్నాను పర్సనల్ విషయం కాబట్టి. నేను ఏదైనా చెప్తే అవతలి వాళ్లకు ఎఫెక్ట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. త్వరలోనే దానికి ఎండ్ కార్డు వేస్తాను. దేవుడు అన్ని చక్కగా చూస్తే జరుగుతుంది అని తెలిపాడు.

దీంతో ఇండైరెక్ట్ గా ఈషా సపోర్ట్ చేస్తుందని, ఈ విషయం చెప్పడానికి మంచి టైం కోసం చూస్తున్నాను అని చెప్పడంతో వీరిద్దరి రిలేషన్ నిజమే అని ఫిక్స్ అవుతున్నారు జనాలు. అయితే తరుణ్ భాస్కర్ కి ఆల్రెడీ పెళ్లి అయి విడాకులు తీసుకున్నాడు. అతని మాజీ భార్య లతా నాయుడు సినీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది.

Also Read : Happy Movie Working Stills : 20 ఏళ్ళ అల్లు అర్జున్ ‘హ్యాపీ’.. అప్పటి వర్కింగ్ స్టిల్స్ చూశారా..?