Indian Navy Vacancies : ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈనోటిఫికేషన్ ద్వారా అండమాన్, నికోబార్ కమాండ్ హెడ్ క్వార్టర్స్‌లో వివిధ యూనిట్లలో ఉన్న ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 112 ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. విద్యార్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు చెల్లిస్తారు.
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 9, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.andaman.gov.in/ పరిశీలించగలరు.