SBI Recruitment : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీల భర్తీ

పోస్టుల్లో 1400 రెగ్యులర్‌ ఉద్యోగాలు ఉండగా.. మరో 22 బ్యాక్‌ లాగ్‌ లాగ్‌ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా విభాగంలో డిగ్రీ,అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI Recruitment

SBI Recruitment : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 1422 పోస్టుల్లో అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి 300 పోస్టులు. మహారాష్ట్ర, గోవాకు 212, రాజస్థాన్‌కు 201, తెలంగాణకు 176, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, అండమాన్‌ నికోబార్‌ దీవులకు 175, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు 175 పోస్టులు రిజర్వ్‌ చేయబడ్డాయి.

పోస్టుల్లో 1400 రెగ్యులర్‌ ఉద్యోగాలు ఉండగా, మరో 22 బ్యాక్‌ లాగ్‌  ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా విభాగంలో డిగ్రీ,అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21నుండి 30 ఏళ్ల మధ్య నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 7, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;WWW. sbi.co.in పరిశీలించగలరు.