327 Posts of Job Notification Released For Singareni Recruitment
Singareni Recruitment : తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా గురువారం (మార్చి 14) సింగరేజిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం సింగరేణిలో ఖాళీగా ఉన్న అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేసే దిశగా కసరత్తు చేస్తోంది. సింగరేణిలో మొత్తం 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు దరఖాస్తు :
అందులో ఈఅండ్ ఎం మేనేజ్మెంట్ ట్రైనీ (ఎగ్జిక్యూటివ్ క్యాడర్)లో 42 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైని(సిస్టమ్స్)లో 7 పోస్టులు, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ గ్రేడ్ సీలో 100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (మెకానికల్ గ్రేడ్-సీ) 9 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ గ్రేడ్ సీ-2 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరి-1లో 47 పోస్టులు, సింగరేణి ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరి-1లో 98 పోస్టుల భర్తీ చేయనుంది.
ఆసక్తి గల అభ్యర్థులు సింగరేణిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 327 పోస్టులకుగానూ ఏప్రిల్ 15 నుంచి మే 4న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ మేరకు సింగరేణి సంస్థ నోటిఫికేషన్‌లో సూచించింది.
Read Also : TSPSC Group-1 Exam : తెలంగాణలో గ్రూపు-1 పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?