Andhra University : ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి ఆంధ్రా యూనివర్సిటీలో అకడమిక్ ఫీజు సంవత్సరానికి 8000 నుండి 14500 వరకు ఉంటుంది , అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంవత్సరానికి11000 నుండి 17500 వరకు పీజు ఉంటుంది.

Education Programs

Andhra University : విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆన్‌లైన్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. దూరవిద్య అడ్మిషన్ 2023-24 దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 31, 2023గా నిర్ణయించారు. UG/PG దూరవిద్య కోర్సులైన BA, BCom, MA, MCom, MSc, MCA మరియు MBA సెషన్ 2023-24లో ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి ఆంధ్రా యూనివర్సిటీలో అకడమిక్ ఫీజు సంవత్సరానికి 8000 నుండి 14500 వరకు ఉంటుంది , అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంవత్సరానికి11000 నుండి 17500 వరకు పీజు ఉంటుంది. యూజీ ,పీజీ కోర్సులకు ప్రవేశం మెరిట్ ఆధారంగా ఉండగా మరి కొన్ని కోర్సులకు ప్రవేశ పరీక్ష రాయవలసి ఉంటుంది.

కోర్సులకు సంబంధించిన వివరాలకు ;

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు ; బీఏ(హిస్టరీ, ఎకనామిక్స్‌, పాలిటిక్స్‌), బీకాం, బీకాం(అకౌంటెన్సీ) కోర్సులు ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి మూడేళ్లు. గరిష్ఠంగా ఆరేళ్లలో పూర్తిచేసే అవకాశం ఉంటుంది. ఇంటర్‌,రెండేళ్ల ఐటీఐ,పాలిటెక్నిక్‌ డిప్లొమా ఉత్తీర్ణులు అలాగే వెటర్నరీ,అగ్రికల్చర్‌ డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు ; ఎంఏ(సోషియాలజీ,పొలిటికల్‌ సైన్స్‌,హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌,జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌,ఎకనామిక్స్‌,ఇంగ్లీష్‌), ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం, ఎమ్మెస్సీ(సైకాలజీ) ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగేళ్ల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. అలాగే ఎంసీఏలో ప్రవేశానికి బీసీఏ,బీఎస్సీ,బీకాం,బీఏ ఉత్తీర్ణులవ్వటంతోపాటుగా ఇంటర్‌ స్థాయిలో మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. ఇతర ప్రోగ్రామ్‌లకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్రెంటిస్‌షిప్‌ ఎంబెడెడ్‌ డిగ్రీ కోర్సులు ; దీనిలో బీకాం, బీఏ, ఎంకాం, ఎంఏ(ఎకనామిక్స్‌,పొలిటికల్‌ సైన్స్‌) కోర్సులు ఉన్నాయి.

ఆసక్తి ఉన్న విదేశీ అభ్యర్ధులు సైతం దూరవిద్య కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్‌ తీసుకున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ అందిస్తారు. కోర్సులకు సంబంధించి నిర్దేశించిన సిలబస్‌ వివరాలకు గాను వెబ్‌సైట్‌ పరిశీలించవచ్చు.

దరఖాస్తు ఫీజుగా రూ.500 అలాగే విదేశీయులకు అయితే 15 యూఎస్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 31, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.andhrauniversity.edu.in పరిశీలించగలరు.