Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు

మొత్తం ఖాళీలు 55 ఉన్నాయి. వాటిలో ఎన్‌సీసీ మెన్ 50 ఖాళీలు, ఎన్‌సీసీ ఉమెన్ 05 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల వయస్సు 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇతర అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.

Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు 2023 అక్టోబరులో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌సీసీ‌ సర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

మొత్తం ఖాళీలు 55 ఉన్నాయి. వాటిలో ఎన్‌సీసీ మెన్ 50 ఖాళీలు, ఎన్‌సీసీ ఉమెన్ 05 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల వయస్సు 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇతర అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.

షార్ట్‌లిస్ట్ చేసిన వారికి ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపిక అయిన వారికి చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు స్టైపెండ్ గా రూ.56,100 చెల్లిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 15 ఫిబ్రవరి 2023 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; joinindianarmy.nic.in పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు